Megha Akash : పెళ్లి పీటలు ఎక్కబోతున్న నితిన్ హీరోయిన్… నిజం ఏంటంటే?

Megha Akash : ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లంతా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ఒక ఇంటికి కోడలు అయిపోతున్నారు. తాజాగా మరో హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందా? అంటే…

పెళ్లి వార్తలకు ఇదే కారణం..

హీరోయిన్ మేఘా ఆకాష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఆమె ఒంటి నిండా నగలు ధరించి, పట్టు చీరలో చేతులకు మెహేంది పెట్టుకొని కనిపించింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో నిజంగానే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతోందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో మరీ ఇలా చడీ చప్పుడు లేకుండా ఆమె పెళ్లి చేసుకోవడం ఏంటి? అని ఆరా తీయడం మొదలుపెడితే…

పెళ్లి కూతురు కాదు.. నిజం ఇదే..

ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్న మాట నిజమే కానీ ఈ ఫోటోలు మాత్రం ఆమె వివాహ వేడుకకు సంబంధించినవి కాదని సమాచారం. యాడ్ షూట్ లో పాల్గొనగా, ఆ ఫోటోలని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మేఘ త్వరలోనే ఓ పొలిటీషియన్ కొడుకుని పెళ్లి చేసుకోబోతోంది అనే టాక్ నడుస్తోంది.

- Advertisement -

హిట్స్ నిల్ అవకాశాలు ఫుల్

లై సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన మేఘ ఆకాష్ ఆ తర్వాత చల్ మోహన్ రంగా, రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం మేఘ ఆకాష్ చేతిలో రెండు తెలుగు సినిమాల తో పాటు మరో తమిళ సినిమా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్లు వీళ్ళే..

ఇక ఈ ఏడాది హీరోయిన్లు వరుసగా పెళ్లి బాట పడుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, అపర్ణ దాస్ వంటి హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకోగా, త్వరలోనే తమన్నా, అదితి రావు హైదరి కూడా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అదితి రావు హైదరి కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ ను వివాహం చేసుకోబోతోంది. వీళ్ళిద్దరూ మార్చ్ లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్ధార్థ్ ఇండియన్ 2 మూవీలో నటిస్తుండగా, ఆ మూవీ రిలీజ్ అయ్యాక అంటే జూన్ నుంచి ఆగస్టులోపు ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని కోలీవుడ్ మీడియా కూడా కూస్తోంది. రీసెంట్ గా ఇదే విషయాన్ని అడగ్గా, పెళ్లికి టైం ఉందని చెప్పింది అదితి రావు హైదరి. ఇక మరోవైపు కీర్తి సురేష్ పెళ్లి గురించి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అందుకే కీర్తికి తెలియకుండానే పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ బ్యూటీ పెళ్లి గురించి లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు