Simbu: ఆమె కోసం కోట్ల ఖర్చు.. పెళ్లి కూడా అనుకున్నారు.. కట్ చేస్తే..!

Simbu.. ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు.. తమిళ్ లో పలు చిత్రాలలో నటించి భారీ క్రేజీ సొంతం చేసుకొని.. ఆ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన విషయం తెలిసిందే . ఈయన సినిమాల సంగతి అటు ఉంచితే.. ఎక్కువగా ఈయన హీరోయిన్లతో నడిపిన ఎఫైర్సే ముందుగా గుర్తుకొస్తాయి.. ముఖ్యంగా హీరో శింబు ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ అనగానే మనకు నయనతార, ఐశ్వర్య రజినీకాంత్, హన్సిక, త్రిష ఇలా చాలామంది హీరోయిన్లు గుర్తుకొస్తారు.. ప్రత్యేకించి వీరిలో ఒక హీరోయిన్ కోసం ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. కానీ ఎవరికి వారు యమునా తీరయ్యారు . ఆమెమో వివాహం చేసుకొని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. కానీ శింబు మాత్రం ఒంటరిగా.. అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Simbu: Spending crores on her.. They even planned to get married.. If cut..!
Simbu: Spending crores on her.. They even planned to get married.. If cut..!

హన్సిక కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసిన శింబు..

ఆమె ఎవరో కాదు పాల బుగ్గల సుందరి హన్సిక మోత్వాని.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిన ఈమె ఆ తర్వాత తమిళంలో, తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హన్సిక ఇప్పుడు టాలీవుడ్ వదిలి తమిళ చిత్ర సినిమాలోనే సెటిల్ అయ్యింది.అయితే అప్పుడప్పుడు తెలుగు చిత్రాలలో కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే హన్సిక లవ్ స్టోరీలలో సౌత్ లో బాగా చెప్పుకునేది శింబు తో ఆమె ప్రేమాయణం. వీరిద్దరిపై రూమర్స్ గట్టిగానే వినిపించాయి. అంతే కాదు ఈమె కోసం శింబు భారీగా ఖర్చు చేశాడట. ఒక సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట.. ఆ పరిచయంతోనే ప్రేమలో పడ్డారు .అయితే ఆ ప్రేమ కూడా రెండు నెలల్లోనే ముగిసిపోయింది.. పైగా పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట.. ఇక అందులో భాగంగానే రెండు నెలల సమయంలోనే హన్సిక కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట శింబు.. అయితే ఏమైందో తెలియదు కానీ రెండో నెలల్లోనే వీరిద్దరూ విడిపోయారు.. ఆ తర్వాత శింబు అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండగా హన్సిక మాత్రం తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఒకసారి హన్సిక తన ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆమె తన మొదటి ప్రేమను మర్చిపోవడానికి దాదాపు పది సంవత్సరాల సమయం పట్టింది అంటూ బాధపడింది.. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

శింబు సినీ ప్రయాణం..

తమిళంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న టి. రాజేందర్ పెద్ద కుమారుడే శింబు. తండ్రి దర్శకత్వం లో వచ్చిన పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి టీనేజ్ రాగానే హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో వివాదాస్పదంగా కూడా అంతే మారాడు. మొత్తానికైతే ఈయన చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు