Thandel : నాగ చైతన్య సినిమా కొత్త రిలీజ్ డేట్? బరి నుండి తప్పుకుందా?

Thandel : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో నాగ చైతన్య నటిస్తున్న “తండేల్” కూడా ఒకటి. వరుస ప్లాప్ ల తర్వాత ఈ సినిమా తో ఎలాగైనా హిట్టు కొట్టాలని నాగ చైతన్య కసిమీదున్నాడు. ఇక నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం తండేల్. దాదాపు 80 నుండి 100 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర లో జరిగిన నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఖచితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అక్కినేని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. పైగా ఈ సినిమా కోసం ముందుగానే మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొని రియాల్టీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సక్సెస్ కోసం నాగ చైతన్య కష్టం..

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ తండేల్ (Thandel ) లో పాకిస్థాన్ లో బందీలుగా మారిన భారత మత్స్యకారుల జీవిత ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక హీరో నాగచైతన్య లుక్ కూడా అదిరిపోగా, హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ అవనుంది. పైగా సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైం చై డీ గ్లామర్ గా కనిపిస్తున్నాడు. అయితే తండేల్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇది వరకే చాలా రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ అదే సమయంలో పుష్ప 2 సినిమా రిలీజ్ ఉండడంతో వాయిదా వేశారు. ఆ మధ్య దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ దేవర తో పోటీ రిస్క్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గ కంటెంట్ కాబట్టి అందరికీ చేరువయ్యేలా గ్రాండ్ గా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. అందుకే సోలో రిలీజ్ డేట్ కోసం, లేదా పెద్ద సినిమాల పోటీ లేకుండా ట్రై చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ డేట్ కే తండేల్ ఫిక్సా?

అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 20 అయితే పర్ఫెక్ట్ డేట్ అని, పెద్ద సినిమాలు పోటీ ఉండవని, సంక్రాంతి వరకు ఎలాంటి సినిమాలతో కూడా ఇబ్బంది ఉండదని చూస్తున్నట్టు భావిస్తున్నారట. ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ ఇస్తూ త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తండేల్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. తప్పకుండా ఇందులో ఉండే ఎలిమెంట్స్ ప్రతి ఇండియన్ కి కనెక్ట్ అవుతాయని అర్థమవుతుంది. ఇక దేశభక్తి కంటెంట్, అలాగే మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ కావడంతో కూడా ఉండడంతో ఈ సినిమాకు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు