Thandel : భారీ యాక్షన్ సన్నివేశాల్లో మేకర్స్.. ఆ సీన్ మాత్రం దద్దరిల్లేలా?

Thandel : అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి కాంబినేషన్ లో “తండేల్” అనే భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో చైతన్య కి జోడీగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు లవ్ స్టోరీ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సారి ఈ కాంబోలో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ లో క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా దాదాపు రెండేళ్లుగా సినిమాలు చేయలేదు. అలాంటిది ఇప్పుడు సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మూవీలో కంటెంట్ ఏదో బలంగా ఉంటుందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి సాయి పల్లవి మాత్రమే సరిపోతుంది అని డిసైడ్ అయ్యి మరీ ఎంపిక చేసుకున్నారట. ఇక నాగ చైతన్య కూడా దూత వెబ్ సిరీస్ హిట్ తర్వాత మంచి జోష్ లో ఉన్నాడు.

టీజర్ తో భారీ క్రేజ్..

అయితే తండేల్(Thandel) మూవీ మొదలయ్యాక మామూలుగా చాలా మందికి ఈ సినిమా అంతగా ఫోకస్ పడలేదు. కానీ తండేల్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని అద్భుతమైన విజువల్స్ తో ఆవిష్కరించి చందూ మొండేటి సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా జనాలని ఆకర్షించింది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో సముద్రంపై వేటకి వెళ్లే మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రైటర్ ఈ కథని సిద్ధం చేశారట. ఇక తండేల్ సినిమాలో అదిరిపోయే లవ్ స్టోరీతో పాటు అంతకుమించి దేశభక్తి పెంచే సన్నివేశాలు ఉంటాయంట. అలాగే గూస్ బాంబ్స్ తెప్పించే పలు యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ఉంటాయని టాక్ వినిపిస్తుంది. తాజాగా తండేల్ మూవీలో నాగ చైతన్య పై ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారట మేకర్స్..

థియేటర్లో విజిల్స్ వేయించేలా..

ఇక నాగచైతన్య సహా చిత్ర యూనిట్ తాజాగా తండేల్ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అయ్యప్పన్ కోషియమ్, ఆనిమల్ వంటి క్రేజీ సినిమాలకు పని చేసిన ఫేమస్ స్టంట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ ఈ స్టంట్ కు వర్క్ చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వర్షం ఫైట్ సీక్వెన్స్ ఉందంట. ఈ సీక్వెన్స్ లో నాగ చైతన్య ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి మాస్ లుక్ లో కనిపిస్తాడట. ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఒక్కడు కూడా కుర్చీలో కూర్చొని ఉండరని, థియేటర్స్ దద్దరిల్లడం పక్కా అని, ఆ సీన్లు విజిల్స్ వేయించేలా ఉంటాయని టాక్ నడుస్తుంది. ఇక నాగ చైతన్య మాస్ అప్పీల్ ని ఎంజాయ్ చేయడానికి అక్కినేని ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉంటాయట. అంతకు మించి ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపీడిస్తాయట. ఇక తండేల్ లో శ్రీకాకుళం స్లాంగ్ లోనే నాగ చైతన్య, సాయి పల్లవి డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయని, అచ్చమైన ఉత్తరాంధ్ర నేటివిటీని, అక్కడి సముద్రపు అందాలని చందూ మొండేటి సిల్వర్ స్క్రీన్ పై తండేల్ ని ఆవిష్కరిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక దసరా కానుకగా అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు