Manjummel Boys : ఇక ఏ అడ్డు లేదు.. దీనిపైనే ఆడియన్స్ ఫోకస్?

Manjummel Boys : టాలీవుడ్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. బుకింగ్స్ కూడా ఈవెనింగ్ షోస్ లో చాల డల్ అయిపోయాయి. దీంతో ఈ సినిమాతో కూడా విజయ్ కి నిఖార్సైన హిట్ దక్కడం లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ ఒక నాసిరకం సినిమా అని సినిమా చూసిన చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. పైగా ఇప్పుడు ఆ రోజుల్లో లాగా సినిమాలకు రెండు మూడు సార్లు వెళ్లే పరిస్థితి లేదు. సినిమా కంటెంట్ బాగుంటే అది ఏ భాష సినిమా అయినా, తెలుగు జనాలు వెళ్తున్నారు. ఈరోజు విడుదలైన ఫ్యామిలీ స్టార్ ఫలితం తేలిపోయింది. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ మంజుమ్మేల్ బాయ్స్ పైనే పడింది. మ‌ల‌యాళంలో ఊహించని రీతిలో విజయం సాధించి, రికార్డులు తిర‌గ రాస్తున్న‌చిత్రం ”మంజుమ్మెల్ బాయ్స్”. బాక్సాఫీస్ వద్ద రూ. 220 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుకు రిలీజ్ కి రెడీ అయింది.

ఇండస్ట్రీ హిట్ సినిమా తెలుగులో రచ్చ కి రెడీ?

మలయాళం లో నెలన్నర కింద రిలీజ్ అయిన ఈ సినిమా స్టార్‌ హీరోలకి కూడా సాధ్యపడని రీతిలో వ‌సూళ్లను రాబ‌డుతూ మలయాళ ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది. తమిళనాడులో ఏకంగా 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ డబ్బింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తోందన్న విషయం తెలిసిందే. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 6న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఫ్యామిలీ స్టార్ వల్ల ఒకరోజు ముందుకు జరిపారు. ఇక మేకర్స్ అయితే డబ్బింగ్ మూవీ లా కాకుండా, ఏకంగా స్ట్రెయిట్ సినిమా మాదిరిగా దాదాపు 300 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. పైగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారట. ఇక ఈ సినిమా డబ్బింగ్ విషయంలో కూడా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా అనువాద చిత్రం అనే ఫీలింగ్ కలగకుండా, ప్రాపర్ ఒరిజినల్ సినిమా అనిపించేలా డబ్బింగ్ చేసారు. ఇప్పుడు సినీ అభిమానులంతా ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

నటీనటులతో సహా మేకర్స్ తెలుగు ప్రమోషన్స్..

ఇక మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) తెలుగు రిలీజ్ కోసం మలయాళ చిత్ర బృందం హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్స్ చేయడం ఇక్కడి ప్రేక్షకులని ఆకర్షించింది. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇక గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాని తెరకెక్కించారు. కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లింగ్ ఇలా అన్ని ర‌కాల భావోద్వేగాల‌తో, ప్రేక్ష‌కుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టే సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఇది ఫ్రెండ్షిప్ గురించి, ఒకటిగా కలిసి ఉండటం గురించి తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీన్స్ నిజంగా మన కళ్ళ ముందు జరుగుతోందనే భావన కలిగించేలా, ఉండాలని మేకర్స్ దాదాపు సినిమా అంతా రియల్ లొకేషన్ లోనే సూట్ చేసారు. ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు సినిమాని కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెల్సిందే. ఇక ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు