Best Comedy Movies in OTT : మూడ్‌ను ఛేంజ్ చేసే కామెడీ మూవీస్… ఓ సారి ట్రై చేయండి..

Best Comedy Movies in OTT : ఈమధ్య కాలంలో ప్రేక్షకులు అన్ని జానర్లలో సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ల హవా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు చాలామంది ఓటీటీ లలో వచ్చే సినిమాల కోసం తెగ ఆత్రుత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సినిమాలతో పాటు కామెడీ చిత్రాలకి కూడా ఆడియన్స్ ఓటు వేస్తున్నారు.. మిగతా జానర్ల సినిమాలను పక్కన పెడితే మనం మూడ్ ను చేంజ్ చేసే కామెడీ మూవీస్ ఇప్పుడు పలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. మరి ఇప్పుడు చెప్పబోయే కామెడీ ఎంటర్టైన్మెంట్ ( Best Comedy Movies in OTT ) చిత్రాలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..

మ్యాడ్ :

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై హారికా సూర్యదేవర , సాయి సౌజన్య నిర్మించిన మ్యాడ్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడు ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి.. ఫ్రెండ్షిప్ , ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ కథ వినోదంలో కొత్తదనాన్ని చూపించింది.. లాజిక్ ని పక్కన పెట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్ తో వినోద బరితంగా కథ ముందుకు తీసుకెళ్లారు.. మొత్తానికైతే మన మూడ్ ను పూర్తిగా చేంజ్ చేసి కాసేపు హ్యాపీగా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. మనోజ్, అశోక్, దామోదర్ చాలా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.

ఓటీటీ ప్లాట్ఫామ్ : నెట్ ఫ్లిక్స్
ఓటిటీ విడుదల తేదీ : 3 నవంబర్ 2023
IMDb రేటింగ్ : 7.4/10

- Advertisement -

మేము ఫేమస్ :

2023లో తెలుగులో విడుదలైన కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై అనురాగరెడ్డి , శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమాకి సుమంత్ ప్రభాస్ హీరోగా , దర్శకుడిగా పని చేశారు.. సుమంత్ ప్రభాస్, మౌర్య చౌదరి , మనీ ఏగొర్ల ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా ఈ ముగ్గురు చేసే గొడవలతో ఊరి రచ్చబండ ఎప్పుడు పంచాయితీ లతోనే కళకళలాడుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఎలాగైనా ఫేమస్ అవ్వాలని చేసే ప్రయత్నంలో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి.

ఓటీటీ ప్లాట్ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ విడుదల తేదీ : 30 జూన్ 2023
IMDb రేటింగ్: 7.1/10

సామజవరగమన:

2023లో విడుదలైన ఈ తెలుగు కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించారు.. రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణు, రెబా మోనికా , వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. హీరో తాత తన ఆస్తిని డిగ్రీ పాస్ అయితే తప్ప తన కొడుకుకి ఇవ్వను అనే విధంగా వీలునామా రాసి చనిపోతారు. వందల కోట్ల ఆస్తి కాబట్టి.. ఆస్తి కోసమైనా తండ్రిని డిగ్రీ చదివించి.. పాస్ చేయించుకోవాల్సిన బాధ్యత హీరోది.. ఈ ప్రాసెస్ లో తండ్రి పరీక్షకి వెళ్లడం, కొడుకు తండ్రికి ట్యూషన్ పెట్టించడం , కాపీ కొట్టైనా పాస్ అయ్యేందుకు ఏర్పాట్లు చేయడం వంటివన్నీ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి..
ఓటిటి ప్లాట్ఫామ్ : తెలుగు ఆహా
ఓటిటి రిలీజ్ డేట్ :28 జూలై 2023
IMDb రేటింగ్: 7.4/10

రైటర్ పద్మభూషణ్ :

సుహాస్ హీరోగా, నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన వినోదాత్మక చిత్రం రైటర్ పద్మభూషణ్.. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్: Zee 5
ఓటీటీ రిలీజ్ డేట్:17 మార్చ్ 2023
IMDb రేటింగ్: 7.5/10

మస్తు షేడ్స్ వున్నాయ్ రా..

వంశీ నందిపాటి సమర్పణలో కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఆర్ ఎం రెడ్డి ప్రశాంత్ భవాని కాసుల నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతిరావు దర్శకత్వం వహించారు అభినవ్ఘోమటం ప్రధానోపాత్రులు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ విపరీతంగా ఆకట్టుకుంది.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్:29 మార్చ్ 2024
IMDb రేటింగ్: 7.7/10

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు