Nara Rohit : ఆరేళ్ళకు మళ్ళీ బిజీ అవుతున్న నారా వారి అబ్బాయి..

Nara Rohit : టాలీవుడ్ లో స్టార్ హీరోల ఫ్యామిలీ ల నుండి, అలాగే దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్ నుండి ఎంతో మంది హీరోలు వస్తుంటారు. అలాగే రాజకీయ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో నారా రోహిత్. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రాజకీయ నాయకుల ఫ్యామిలీ అయిన నారా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరో నారా రోహిత్. తొలి చిత్రం బాణం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర వంటి చిత్రాలతో ఆడియన్స్ ని మెప్పించాడు నారా రోహిత్. అయితే వరుస పరాజయాలతో కొన్నాళ్ళకు సినిమాలకు దూరమయ్యాడు రోహిత్. ఇక ఇప్పుడు చాలా రోజులకు నారా రోహిత్ మళ్ళీ సినిమాల విషయంలో మళ్లీ స్పీడ్ పెంచారు. 2018లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో అలరించిన రోహిత్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆరేళ్ల తర్వాత ప్రతినిధి 2 మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.

ఈ ఇయర్ లో రీ ఎంట్రీ?

నారా రోహిత్ (Nara Rohit) పదేళ్ల క్రితం నటించిన ప్రతినిధి అప్పట్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ప్రతినిధికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ప్రతినిధి 2 మూవీ త్వరలో విడుదల కానుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత నారా రోహిత్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా తాజాగా నారా రోహిత్ 20వ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. తాజాగా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు మేకర్స్. ‘సుందరకాండ’ వంటి క్లాసిక్ టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవి ని వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ టైటిల్ గ్లింప్స్ తో పాటు నారా రోహిత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో కూల్ అండ్ క్లాసీగా ఒక చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో కనిపిస్తున్నారు నారా రోహిత్.

టైటిల్ గ్లిమ్ప్స్ లో లెంగ్తీ డైలాగ్..

ఇక టైటిల్ గ్లింప్స్ లో “ప్రేమ.. ఇది అందరి లైఫ్ లో కామన్ గా జరిగేదే.. అమ్మ అన్నం పెట్టినా.. ఫ్రెండ్ బూతులు తిట్టినా.. ఒక్క అమ్మాయిని చూసిన వెంటనే నచ్చినా.. అదే అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఏడ్చినా.. అన్నిట్లో ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది” “కొన్ని మణిరత్నం గీతాంజలిలా సాడ్ ఎండింగ్ అవ్వవచ్చు. మురారిలో మహేష్ బాబులా ఫేట్ తో ఫైట్ చేయొచ్చు.. గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావేలా ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు.. బొమ్మరిల్లులో సిద్ధులా పేరెంట్స్ చేతిలో డిసెషన్ పెట్టొచ్చు.. ఖుషిలో పవన్ కళ్యాణ్ లా మనస్పర్థలు రావచ్చు.. ఆర్యలో అల్లు అర్జున్ లా వన్ సైడ్ లవ్ అవ్వవచ్చు. ఇలా ఎన్ని ఉన్నా.. ఏ రెండు ప్రేమ కథలు ఒకలా ఉండవు. అందుకే ప్రతి కథలో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్ నా లైఫ్ లో కూడా జరిగింది” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఒక బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్రితి వాఘని హీరోయిన్ గా నటిస్తుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుండగా, ఈ ఈ సినిమాతో నారా రోహిత్ మంచి సక్సెస్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు