Robin Hood : ఆ డేట్ ని ఫిక్స్ అయిన రాబిన్ హుడ్.. సోలో గా?

Robin Hood : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మీడియం రేంజ్ హీరోల్లో గట్టి పోటీనిచ్చిన నితిన్, ఇప్పుడు ఒక్క హిట్టు కోసం తపిస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్ల తర్వాత నితిన్ ఈసారి ఎలాగైనా రాబిన్ హుడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. అందుకే ఇదివరకే భీష్మ వంటి మంచి సక్సెస్ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల ఈసారి సరికొత్త స్టైల్ తో నితిన్ చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన భీష్మ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి దర్శకుడు కమర్షియల్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కూడా సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ గతంలో ఎప్పుడూ లేనంత హై స్టైలిష్ యాక్షన్ తో కనిపించబొతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వైరల్ గా మారాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రాబిన్ హుడ్..

అయితే నితిన్ రాబిన్ హుడ్ (Robin Hood) తాజాగా విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శ్రీ రామ నవమి సందర్బంగా అఫీషియల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ని ప్రకటించగా, రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇక పోస్టర్ లో కూడా నితిన్ క్యాప్ తో స్టైలిష్ బైక్ పై సీరియస్ గా కూర్చున్న లుక్ కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో అతను పవర్ఫుల్ గా కనిపిస్తాడని సమాచారం. ఇక కథలో ఒక మంచి సందేశం కూడా హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకుంటాడు. అతని మొదటి సినిమా చలో కామెడీ డ్రామాగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నితిన్ తో చేసిన భీష్మలో వ్యవసాయానికి సంబంధించిన అంశంతో పాటు కామెడీ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి.

సోలో రిలీజ్?

అయితే నితిన్ రాబిన్ హుడ్ సినిమాను సోలో రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో రిలీజ్ కి ఇంకా ఏ సినిమా కూడా ఫిక్స్ కాకపోవడంతో ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ లాంటి వారు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు వెంకీ ఈసారి రాబిన్ హుడ్ సినిమాలో మరో మంచి కథాంశంను హైలెట్ చేస్తూనే తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా నితిన్ కం బ్యాక్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు