Maniratnam : రాజమౌళి వల్లనే పొన్నియన్ సెల్వన్ తీయగలిగాను

మణిరత్నంని ఇష్టపడని సినీ అభిమానులు ఎవరు ఉండరు. ఇప్పుడున్నఎంతో మంది గొప్ప పేరున్న దర్శకులకి ఆయనే స్ఫూర్తి. ఆయన తీసిన సినిమాలని ఫిలిం స్కూల్స్ లో పాఠాలగా చెప్తారంటే ఆయన ఎంత గొప్ప దర్శకుడో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి దర్శుకుడు రాజమౌళి వల్లనే ఆయన డ్రీం ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ తీయగలిగాడంట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు,ఆయనే స్వయంగా చెప్పిన మాట

కల్కి కృష్ణ మూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం గారి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం PS2. ఇప్పటికే రిలీజ్ అయిన పార్ట్-1 కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. ఈ సందర్బంగా PS టీమ్ హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసారు.

జయం రవి, విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయ్ , మణిరత్నం, దిల్ రాజు , విజేంద్ర ప్రసాద్ మరియు ప్రముఖుల మధ్య ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగ మణిరత్నం మాట్లాడుతూ ” నేను ఇంతకు కూడా ఇది చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా రాజమౌళి లేకపోతే నేను పొన్నియన్ సెల్వన్ తీసి ఉండేవాణ్ణి కాదు. ఆయన బాహుబలి రెండు పార్ట్ లుగా తీయడం వల్లనే నాకు కూడా ఈ కథ ని రెండు పార్ట్ లుగా తీయాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయం నేను రాజమౌళికి పర్సనల్ గా కూడా చెప్పను, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చెప్తున్నా ఆయన ఈ పాత్ ని క్రియేట్ చేసుండకపోతే ఈ పొన్నియన్ సెల్వన్ ఇంత గ్రాండియర్ గా తీసేవాణ్ని కాదు” అని ఆయన అన్నారు.

- Advertisement -

పొన్నియన్ సెల్వన్ రాజమౌళి చాలా ఇష్టమైన నవల అని ఆయన చాలా సార్లు చెప్పారు. కాకపోతే దాన్ని సినిమాలాగా తీయలేం ,వెబ్ సిరీస్ లాగ తీయడం వీలవుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తరువాత కొద్దిరోజులకే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా ఎనౌన్స్ చేసారు. రాజమౌళి కూడా ఎక్సయిట్ అయి మణిరత్నం కి విషెష్ తెలిపారు. ఇలా ఇద్దరు లెజెండ్స్ ఒకరి సినిమాల గురించి ఇంకొకరు మాట్లాడటం, విషెష్ చెప్పుకోవడం తెలుగు, తమిళ్ పరిశ్రమలలో మంచి సూచన అని చెప్పొచ్చు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు