Tollywood: విరూపాక్ష కి ఆ సినిమా కి లింక్ ఏంటి ?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన మౌత్ టాక్ తో భారీగా కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్ల లో పరుగులు తీస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమా కు మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే దాదాపు బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ సినిమా 70 కోట్ల దిశగా దూసుకుపోతుంది.

విరూపాక్ష సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. విరూపాక్ష తెలుగు లో చాలా రోజుల తర్వాత వచ్చిన హర్రర్ మూవీ కావడం విశేషం. అయితే ఈ సినిమా కథలోని ట్విస్ట్ లు ఇంకో సినిమాలోని కథాంశాన్ని పోలి ఉండటం గమనించవచ్చు. అసలు విషయానికి వస్తే విరూపాక్ష సినిమా లోని హీరో తన తల్లితో చాలా సంవత్సరాల తర్వాత సొంతూరికి జాతర కోసం వస్తారు. అయితే ఆ ఊరిలో అప్పుడే అనుమానాస్పద స్థితి లో వరుసగా మనుషులు చనిపోతూ ఉంటారు. ఆ ఊరి గుడి పూజారి ఇది దుష్ట శక్తి వల్లనే అని చెప్పి, గుడి మూసేసి కొన్ని రోజులు కొన్ని రోజులు ఊళ్ళో ఎవరు పొలిమేర దాటి వెళ్లోద్దని చెప్తాడు. అయితే హీరో జరుగుతున్న మరణాలకి కారణం తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరిస్తాడు.

అయితే ఈ సినిమా లోని ట్విస్ట్ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమా మొత్తం ఊహకందని ట్విస్ట్ లతో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సాగుతుంది. అయితే ఈ సినిమా లోని కీలక ట్విస్ట్ లు టాలీవుడ్ లో కొన్నాళ్లకిందట వచ్చిన ఒక స్టార్ హీరో సినిమా లోని కథాంశాన్ని పోలి ఉంది. ఆ సినిమాయే మహేష్ బాబు నటించిన స్పైడర్.

- Advertisement -

స్పైడర్ సినిమాలో మహేష్ బాబు విలన్ యొక్క ఊరికి వెళ్తాడు. అక్కడ విలన్ కి ఆ ఊరిలో ప్రజల వల్ల జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సినిమాలో విలన్ అయిన భైరవుడి కుటుంబాన్ని ఊరి ప్రజలు చంపేస్తారు. అదే అన్యాయం విరూపాక్ష లో కూడా విలన్ కుటుంబానికి జరుగుతుంది. విరూపాక్ష లో విలన్ తల్లి దండ్రుల్ని చంపేస్తారు. ఈ రెండు సినిమాల్లో కూడా విలన్ ఎవరో హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలా నిరోధించాడనేదే కథ. స్పైడర్, విరుపాక్ష రెండు చిత్రాల్లో కూడా విలన్ కుటుంబంలో ఇద్దరు మాత్రమేబతుకుతారు. వాళ్ళు ఊరిపై పగ సాధించే యత్నంలో ఉంటారు. విలన్ కి సంబంధించిన కథ లో చిన్నపాటి ట్విస్ట్ చేంజ్ తో విరూపాక్ష ఉంటుంది. ఆ ట్విస్టే సినిమా కు హైలెట్ గా నిలిచింది. అయితే విరుపాక్షలో విలన్ గురించి తెలుసుకోవడం కన్నా డైరెక్ట్ గా థియేటర్లో చూస్తే ఆ థ్రిల్ బాగుంటుంది. ఏది ఏమైనా విరూపాక్ష సినిమా చక్కటి స్క్రీన్ ప్లే మరియు ట్విస్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తుంది.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు