Meena: రెండో పెళ్లిపై హీరోయిన్ ఆ హీరోయిన్ కూతురు క్లారిటీ !

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి నటిగా మీనా అంటే తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో నటించి చివరికి హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అని చెప్పవచ్చు. ఆనాటి జనరేషన్ కాకుండా ఇప్పటి జనరేషన్ లో ఉన్న హీరోల్లో చాలా మందితో జతకట్టింది ఈ భామ. కానీ ఇటీవల ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది.

తనకు ఎంతో ఇష్టమైన తన భర్తను చిన్న వయసులోనే కోల్పోయింది. దీంతో మీనా తన బిడ్డను చూసుకుంటూ ఒంటరైపోయింది. ఇది ఇలా ఉండగా… గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారులు చేస్తున్నాయి. తనకంటే వయసులో చిన్నవాడైనా ఓ కోలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని ఆ వార్తల సారాంశం. కాగా తాజాగా ఆ వార్తలపై మీనా కూతురు నైనికా స్పందించింది.

మీనా ఇండస్ట్రీ లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో నైనిక ఎమోషనల్ అయ్యింది. అమ్మ నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు గర్విస్తున్నా అని చెప్పింది. నాన్న చనిపోయాక నువ్వు డిప్రెషన్ లోకి వెళ్లిపోయావు. మానసికంగా కూడా దెబ్బ తిన్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇటీవల ప్రముఖ చానల్స్ లో మా అమ్మ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మకు ఫీలింగ్స్ ఉండవా… మా అమ్మ కూడా మనిషే కదా అంటూ నైనికా ఎమోషనల్ అయ్యింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు