Top 5 Animated Movies on OTT : టాప్ 5 యానిమేటెడ్ మూవీస్… ఈ సమ్మర్లో పిల్లలకు ఇవే బెస్ట్ ఎంటర్టైన్మెంట్

Top 5 Animated Movies on OTT : సమ్మర్ వచ్చేసింది. దాంతో పాటే పిల్లలకు హాలిడేస్ కూడా తీసుకొచ్చింది. మరి ఈ సమ్మర్ హాలిడేస్ లో రోజంతా ఇంట్లోనే ఉండే పిల్లలు ఏం చేస్తారు? అంటే టీవీలకు అతుక్కుపోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సరదా సరదా యానిమేటెడ్ మూవీస్ లిస్ట్ ను తీసుకొచ్చాం. అయితే యానిమేటెడ్ అనగానే చిన్నపిల్లల మూవీ అని అనుకుంటారేమో… ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలను చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూసేయొచ్చు. ఈ సినిమాలను చూశాక తప్పకుండా మీరు కూడా యానిమేటెడ్ మూవీ లవర్స్ అయిపోతారు. మరి మీ పిల్లలు ఎండలో తిరగకుండా హ్యాపీగా చూడగలిగే ఆ యానిమేటెడ్ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ది బాస్ బేబీ

బెస్ట్ యానిమేటెడ్ సినిమాలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ది బాస్ బేబీ. అలక్ బాల్డ్ విన్ అనే బాస్ బేబీ క్యారెక్టర్ ను చూస్తున్నంత సేపు పిల్లలు మైమరిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడడానికి చిన్నగా కనిపించే ఈ బేబీ బాస్ స్పైగా మారి చేసే విన్యాసాలు చిన్న పిల్లలను కచ్చితంగా అబ్బుర పరుస్తాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ది లయన్ కింగ్

ఈ మూవీ సింబా అనే ఓ సింహం చుట్టూ తిరిగే స్టోరీతో నడుస్తుంది. 1994లో మొట్టమొదటిసారిగా డిస్నీలో వచ్చింది ఈ క్లాసిక్ యానిమేషన్ మూవీ. అయితే మరోసారి 2019లో ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఈ యానిమేటెడ్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ది లయన్ కింగ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

- Advertisement -

3. అప్

ఓ బెలూన్లు అమ్మే వ్యక్తి అదే బెలూన్ల సాయంతో ఎగిరి సౌత్ అమెరికాకు వెళ్లడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ మూవీ. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్న ఆసక్తికరమైన విషయాన్ని ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. డ్రీం లాగా అనిపించే ఈ యానిమేటెడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. డిస్పేకబుల్ మీ

ఈ మూవీ స్టోరీ ఏకంగా చంద్రుడిని దొంగిలించాలని చూసే గ్రూ అనే సైంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. 14 ఏళ్ల కిందట రిలీజ్ అయిన ఈ మూవీకి సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ పార్ట్ నుంచి రీసెంట్ గా వచ్చిన పార్ట్ దాకా అన్ని సీక్వెల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ యానిమేటెడ్ మూవీని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

5. ఇన్సైడ్ అవుట్

2015లో రిలీజ్ అయిన ఈ యానిమేటెడ్ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ లో అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ లిస్ట్ లో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. ఇన్సైడ్ అవుట్ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. వీటితో పాటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కోకో, మోనా, సిండ్రిల్లా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మినియన్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ అనే టాప్ యానిమేటెడ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు