Jeans Movie on OTT : 26 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Jeans Movie on OTT : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ జీన్స్ ప్రస్తుతం రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా 26 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ క్లాసిక్ మూవీని ఏఏ ఓటిటిల్లో చూడొచ్చు అంటే?

26 ఏళ్లు పూర్తి..

అప్పటికే జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు లాంటి సినిమాలతో అదరగొట్టిన శంకర్ జీన్స్ మూవీతో మరో అదిరిపోయే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేశారు. 1998 ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కవల పిల్లలకు మరో ఇద్దరు కవలలని ఇచ్చి పెళ్లి చేస్తాననే తండ్రి మొండి పట్టుదల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రీసెంట్ గా అంటే 2024 ఏప్రిల్ 24న 26 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

రెండు ఓటీటీల్లో జీన్స్ మూవీ..

ప్రస్తుతం జీన్స్ మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఆహాతో పాటు సన్ నెక్స్ట్ ఓటిటిలో కూడా ఈ మూవీని చూడొచ్చు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ మూవీని అన్ని భాషల వెర్షన్ లలో ఫ్రీగా చూసే అవకాశం ఉంది. మూవీ వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటినప్పటికీ మూవీ లవర్స్ కు మాత్రం ఇంకా ఇది ఎవర్గ్రీన్ మూవీనే. కాబట్టి ఈ మూవీని చూడాలి అన్పిస్తే టీవీల్లో వచ్చేదాకా వెయిట్ చేయకుండా అందుబాటులో ఉన్న ఓటీటీలో  చూసేయండి.

- Advertisement -

ఎవర్ గ్రీన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్..

అప్పట్లో ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, సినిమాలోని ప్రతి పాట కూడా దేనికదే ప్రత్యేకంగా ఉండి మ్యూజికల్ పరంగా కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలను వినడానికి మూవీ లవర్స్ ఇష్టపడతారు అంటే అతిశయోక్తి కాదేమో. అలాగే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా 26 ఏళ్ల కిందటే ఉపయోగించి ప్రేక్షకులను తన మ్యాజిక్ తో మెప్పించాడు శంకర్.

ఒకే పాటలో ప్రపంచంలోని ఏడు వింతలు..

ఈ సినిమాలోని అతిశయం పాట అప్పట్లో ఓ అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క పాటనే అప్పటి ఏడు ప్రపంచ వింతల దగ్గర షూట్ చేశారు. అప్పటిదాకా ఏ సినిమా కోసం ఇలాంటి ప్రయోగాలు చేయలేదు మేకర్స్. ఒక్కో సీన్ ఒక్కో ప్రపంచ వింత దగ్గర ఉండడం దీని ప్రత్యేకత. తాజ్ మహల్ నుంచి మొదలు పెట్టి లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, ఈజిప్ట్ పిరమిడ్స్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్, కొలోజియం దగ్గర ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమాలో అన్ని పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయినప్పటికీ, ఈ ఏడు వింతల కారణంగా అతిశయం పాటే హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి శంకర్ టేకింగ్, గ్రాఫిక్స్ తో పాటు ఐశ్వర్యరాయ్ అందం, ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు