Prasannavadanam Teaser Talk : సుహాస్ కి వింత జబ్బు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, చిన్న పాత్రలు వేస్తూ, ఆ తరువాత ఏకంగా హీరోగా నూ సక్సెస్ అయ్యి తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో సుహాస్. పదేళ్ల కిందటే షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు రావడానికి టైం పట్టింది. ఇక అప్పట్లో ఓటిటి లో కలర్ ఫోటో సినిమాతో ఓటిటి లోనే మంచి హిట్ట్టు కొట్టిన సుహాస్, వరుస హిట్లతో దూసుకుపోయాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇటీవల అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక రీసెంట్ గానే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఇటీవల విడుదలై మూవీ సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది.

ప్రసన్నవదనం..

ఇక సుహాస్ హీరోగా నటించిన అంబాజిపేట మ్యారేజ్ బ్యారేజ్ 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హీరోగా ఇక వరుస సినిమాలతో అలరిస్తున్న సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ప్రసన్న వదనం”. ఇక తాజాగా ఫస్ట్ లుక్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. ఇక తాజాగా తలకు కట్టుతో ఆస్పత్రిలో సుహాస్ ఉన్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. తన తల్లిదండ్రులను కూడా హీరో గుర్తుపట్టలేకపోతాడు. ఫేస్ బ్లైండ్ నెస్ తో హీరో బాధపడుతున్నట్లు డాక్టర్ చెబుతాడు. అయితే మధ్యలో సినిమాలోని చాలా పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. ప్రతీ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కానీ స్టోరీ లైన్ ఎక్కడా రివీల్ అవ్వకుండా మేకర్స్ టీజర్ ను కట్ చేశారు. నార్మల్ గా సుహాస్ చిత్రాల్లో కంటెంట్ రిచ్ గా ఉంటుంది. ప్రసన్న వదనం టీజర్ చూశాక అది మరోసారి రుజువయింది.

- Advertisement -

ఇక ఇప్పుడు రాబోయే చిత్రాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ కు ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా జోడించారు మేకర్స్. టీజర్ లో సుహాస్, మిగతా పాత్రల చుట్టూ ఉన్న సస్పెన్స్ క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రాన్ని ప్రసన్నవదనం అనే టైటిల్ ఎందుకు పెట్టారో టీజర్ చూశాక కొంత క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాతో సుహాస్ పాత్రను మేకర్స్ డిజైన్ చేసిన తీరు చాలా యూనిక్ గా ఉంది. ఎప్పటిలానే తన పెర్ఫార్మెన్స్ తో సుహాస్ అదరగొట్టేశారడు. టీజర్ లో హీరో డైరెక్ట్ గా హాస్పిటల్ లో కనిపిస్తాడు. కట్ చేస్తే హీరోకి ఫేస్ బ్లైండ్ జబ్బు ఉంటుంది. అంటే ఎంత క్లోజ్ గా ఉన్న వాళ్ళకి అయినా గుర్తుపట్టకపోవడం. ఈ క్రమంలోనే హీరో తో తాను చేయని తప్పుకు బలైపోతూ ఉండగా, ఆ సమస్య కి పరిష్కారం కనుక్కున్నాడా లేదా? ఆ జబ్బు వల్ల హీరోకి వచ్చిన ఇబ్బంది ఏమిటీ అనేది థియేటర్లలో చూడాల్సిందే. ఇక సుహాస్ హీరోగా నటించబోయే ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు