Prabhas : ”ఎ డార్లింగ్ పిక్ .. ఇటలీ డైరీస్”

రెబల్ స్టార్ కల్కి 2898 AD సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి టీజర్ తర్వాత మళ్ళీ ఏ అప్డేట్ రాలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పైగా రిలీజ్ డేట్ కి రెండు నెలలు మాత్రమే ఉండడంతో సినిమా రిలీజ్ పై లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అయితే సినిమా షూటింగ్ బ్రేక్ రాలేదు. రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అని సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్లనే ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు. శ్రద్ధా కపూర్, కృతి సనన్, అలాగే ఇప్పుడు అత‌డు దీపిక ప‌దుకొనే, దిశా ప‌టానీ లాంటి అంద‌గ‌త్తెల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరూ ప్రస్తుతం తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే కల్కి నుండి ఏ అప్డేట్ రావట్లేదని నిరాశ చెందుతున్న ఫాన్స్ కి తాజాగా మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ల గురించిన, తాజా అప్‌డేట్‌లను షేర్ చేయ‌డం
స్టార్ట్ చేసారు.

రోమాంటిక్ డ్యూయెట్ కోసం..

కల్కి మూవీకి సంబంధించి డార్లింగ్ ప్రభాస్ అలాగే సెకండ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న దిశా పఠాని పై ఓ పాటను చిత్రీకరించడానికి చిత్ర‌బృందం ఇటలీకి వెళ్లింది. కల్కి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసారు. ”ఎ డార్లింగ్ పిక్ .. ఇటలీ డైరీస్.. ప్ర‌భాస్ – దిశా ప‌టానీ..” అంటూ పిక్స్ షేర్ చేసారు. ఇప్ప‌టికే విమానంలో ప్ర‌భాస్ – దిశా పటాని విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవగా, డార్లింగ్ ప్ర‌భాస్ తో కలిసి కెమెరా వైపు చూస్తూ క్యూట్ గా స్మైల్ ఇస్తుంది దిశా పటాని. ఇక ఇటలీలోని లైవ్ లొకేష‌న్ లో షూటింగ్ కోసం రెడీ అవుతున్న ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈ స్టిల్ లో ప్ర‌భాస్- దిశా ప‌టానీ ఇట‌లీలోని బీచ్ లొకేషన్ లో చ‌లి కోట్లు ధ‌రించి క‌నిపిస్తున్నారు. ప్ర‌భాస్ ఎప్ప‌టిలానే మ్యాన్లీగా క‌నిపిస్తుంటే, దిశా ప‌టానీ నిండుగాదుప్ప‌టి లాంటి కోట్‌లో కనిపించింది. ఆ లొకేషన్ బీచ్ కాగా, పైగా అక్క‌డ చ‌లి వాతావ‌రణానికి తట్టుకోవడానికి ఇద్ద‌రూ అందుకు సంబంధించిన జాగ్ర‌త్త‌లు తీసుకున్నారని తెలుస్తుంది.

- Advertisement -

ప్రభాస్ తో ఫస్ట్ ఆఫ్ లైన్ స్టిల్..

ఇక ఈ సినిమా నుండి ఎన్ని స్టిల్స్ రిలీజ్ అయినా, స్టిల్స్ లీక్ అయినా డార్లింగ్ ప్ర‌భాస్‌ కి సంబంధించిన స్టిల్స్ మాత్రమే రిలీజ్ అయ్యేవి. ఇక దిశా పఠానీ కి సంబంధించి ఇప్పటివరకూ ఒక్క స్టిల్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. కానీ ప్రభాస్ తో ఇలా ఆఫ్ లైన్ స్టిల్ ని మాత్రం అఫిషియల్ గా రిలీజ్ చేసారు. ఈ సినిమా నుండి దిశా పటాని కి సంబంధించి ఫస్ట్ స్టిల్ ఇదే అని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్‌ సోషల్ మీడియా లో వైర‌ల్ గా మారింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి కూడా నటిస్తున్నారని సమాచారం. ఇక కల్కి2898AD చిత్రాన్ని మే9న‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమా నుండి రెగ్యులర్ గా ఇప్పటినుండి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు