Allu Family: బన్నీకి ఆ కండీషన్స్‌ పెట్టిన స్నేహా రెడ్డి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన యాక్టింగ్, అదిరిపోయే స్టెప్పులతో ఎంతోమంది ప్రేక్షకులను కూడగట్టుకున్నాడు బన్నీ. ఇటీవల పుష్ప సినిమాలో నటించినందుకు బన్నీకి ఏకంగా 69 ఏళ్లుగా తెలుగు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది. ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన మరికొన్ని విషయాలను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

బన్నీ సినిమాలకు ఎంత ప్రియారిటీ ఇస్తారో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. తన పిల్లలు, భార్యతో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి బన్నీ ఆసక్తి చూపుతారు. అయితే స్నేహ రెడ్డి హీరోయిన్ కానప్పటికీ, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ మోడ్రన్ లుక్స్ తో ఆమె మెస్మరైజ్ చేస్తుంటుంది. టాలీవుడ్ స్టైలిష్ జంటల పేర్లు చెప్పుకోవాలంటే బన్నీ పెయిర్ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. ఓ హీరోయిన్ తో ఎప్పటికీ నటించవద్దంటూ బన్నీకి క్రేజీ కండిషన్ పెట్టిందట స్నేహ రెడ్డి. ఆ కారణంగానే బన్నీ ఆ హీరోయిన్ తో నటించడానికి నో చెబుతున్నారట. గతంలో ఆ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న బన్నీ ఆమెతో హద్దులు మీరిపోయారట. మరీ ముఖ్యంగా ఆ హీరోయిన్ కి ఇప్పటికే పెళ్లయిపోయి ఓ బిడ్డ కూడా ఉన్నాడట. అయినప్పటికీ ఆ హీరోయిన్ రాత్రుళ్ళు బన్నీ కి కాల్ చేయడాలు వంటి పనులతో తెగ విసిగించేదట. దీంతో అనుమానం వచ్చిన స్నేహారెడ్డి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ హీరోయిన్ కి స్నేహ రెడ్డి కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బన్నీకి సైతం ఈ కండిషన్ పెట్టిందట.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు