Manamey : “మనమే” ఫస్ట్ సాంగ్ వచ్చేసింది… ఆకట్టుకుంటున్న ఫ్రెష్ ట్యూన్స్

Manamey : టాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ “ఇక నా మాటే”ను రిలీజ్ చేసి మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసేసారు చిత్ర బృందం. మరి ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉంది? అంటే…

ఫ్రెష్ ట్యూన్స్ తో ఫస్ట్ సాంగ్…

చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ మనమే మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శర్వా కెరీర్ లో 35వ సినిమాగా తెరకెక్కుతున్న మనమే మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. లండన్, హైదరాబాదులో షూటింగ్ జరుపుకున్న మనమే మూవీ టైటిల్ ను రీసెంట్ గా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అందులో భాగంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “ఇక నా మాటే” అంటూ సాగే ఈ లిరికల్ వీడియో వినసొంపుగా ఉంది. మెలోడీ మెజీషియన్ హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పాటను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ పాడడం విశేషం. ముందుగా ఈ పాటను శర్వానంద్ పాడాడని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు పాట రిలీజ్ అయ్యాక పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఈ పాటకు కృష్ణ చైతన్య అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆహ్లాదకరంగా సాగుతూ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తున్న ఈ సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -

మనమే స్టోరీ ఇదేనా?

మనమే మూవీ లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా ఆ విషయాన్ని మేకర్ స్పష్టం చేశారు. అందులో హీరోతో పాటు చిన్నారి కూడా కనిపించడం, హీరో శర్వానంద్ కాలుకు కట్టు కట్టు ఉండడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక టీజర్ లో కనిపించిన అబ్బాయి పేరు విక్రమ్ ఆదిత్య. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కుమారుడే ఆ అబ్బాయి. సినిమా మొత్తం ఆ అబ్బాయి చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. సినిమాలో ఈ అబ్బాయి, శర్వానంద్ మధ్య ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మనమే మూవీని నిర్మిస్తున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న “మనమే” సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ లండన్ లోనే జరిగింది. వేసవిలో “మనమే”ను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు చిత్ర బృందం. ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.

శర్వానంద్ లైనప్ లో మూడు సినిమాలు…

శర్వానంద్ ఖాతాలో మనమే మూవీతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా శర్వానంద్ 36వ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. అభిలాష్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, తన 37వ సినిమాను కూడా అప్పుడే లైన్ లో పెట్టేసాడు శర్వానంద్. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా 37వ మూవీ రూపొందనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు