Sharwanand: శర్వానంద్ వల్లే స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ..!!

తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించగలిగే హీరో శర్వానంద్ ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.. మాస్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు కాకుండా కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమాలను కూడా చేస్తూ ఉంటారు.. శతమానం భవతి, గమ్యం, అమ్మ చెప్పింది, మహానుభావుడు వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు.. గత కొన్ని నెలలుగా హీరో శర్వానంద్ నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ లేదు.. అయితే ఈ రోజున శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా వరుసగా సినిమా అప్డేట్లను ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు..

శర్వానంద్ మిస్ చేసుకున్న సినిమా..
ఇప్పటివరకు శర్వానంద్ 35 , 36 వ సినిమాలకు సంబంధించి అప్డేట్లు రాగా.. 37వ ప్రాజెక్టును కూడా ప్రకటించేశారు.. దీంతో వచ్చే ఏడాది తన సినిమాలు ఎక్కువగా విడుదల అయ్యే అవకాశం ఉన్నది.. శర్వానంద్ దిన్నెల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు.. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నారు.. ఇలా శర్వానంద్ మిస్ చేసుకోవడంతో యంగ్ హీరో స్టార్ హీరోగా మారిపోయారు.. ఆ సినిమానే అర్జున్ రెడ్డి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తెరకెక్కించగా విజయ్ దేవరకొండ హీరోగా నటించారు..

శర్వానంద్ వల్లే హీరోగా మారిన విజయ్ దేవరకొండ..
ఇక అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్ చేసిన విధానం గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాకి ఫస్ట్ ఛాయస్ గా హీరో శర్వానంద్ ని అడగగా.. కథ నచ్చినా అందులో కొన్ని అంశాలు తనకు సెట్ కావనిపించి రిజెక్ట్ చేశారట.. అందుకే ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని.. ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు శర్వానంద్.. అయితే ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు బాధ లేదని ఎవరికి రాసిపెట్టి ఉంటే కథలు వారి వద్దకే వెలుతాయంటూ తెలియజేశారు..సందీప్ రెడ్డివంగ మళ్ళీ అడిగినా కూడా ఆ కథ తప్ప ఏ కథ అయినా చేస్తానని చెప్పారట.. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నటించడంతో యూత్లో భారీ క్రేజ్ పెరిగిపోయింది.. అలా శర్వానంద్ రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. 35వ చిత్రం మనమే అనే టైటిల్ తో రాబోతోంది.. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.. 36వ సినిమా లూసర్ ఫేమ్ డైరెక్టర్ తో నటించబోతున్నారు.. ఇక ఈ సినిమాలతో సరైన సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఒక్క కమర్షియల్ హిట్టు కొట్టాడంటే ఇక స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతారనడంలో సందేహం లేదు.. మరి ఈయనకి అదృష్టం ఎప్పుడు వరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు