Kriti kharbanda: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న హీరోయిన్ కృతికర్బంద.. పెళ్లి డేట్ ఇదే..!!

ప్రస్తుతం హీరోయిన్ లు ఒకరి తరువాత ఒకరు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే ..ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అయిన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కృతి కర్బంద కూడా ఏడడుగులు వేయబోతోంది. బోణీ సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఈమె రామ్ పోతినేని హీరోగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య వంటి సినిమాలలో కూడా నటించింది.. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది..

కృతి కర్బంద నిశ్చితార్థం..
ఇకపోతే ఈమధ్య సినీ ఇండస్ట్రీ వైపే కనిపించని ఈమె కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉండడం గమనార్హం.. ఇటీవలే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించింది.. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. 2019 నుంచి ప్రేమలో ఉన్న కృతికర్బంద, పుల్కిత్ ఇప్పుడు మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు.. మార్చి నెలలోనే వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు సమాచారం మార్చి 13 నుంచి మార్చి 16 వరకు వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయట. ఇక వీరి వివాహం మార్చి 15వ తేదీన ఢిల్లీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది.. కేవలం ఇరు కుటుంబ సభ్యులు , సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం.

కృతి కర్బంధ, పుల్కిత్ నటించిన చిత్రాలు..
ఇకపోతే కృతి కర్బంధ, పుల్కిత్ ఇద్దరూ కూడా కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. వీరిద్దరూ పగల్పంటి, వీరేకి వెడ్డింగ్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. చివరిగా తైష్ సినిమాలో కూడా కలిసి నటించారు..

- Advertisement -

కృతి కర్బంధ, పుల్కిత్ ప్రేమాయణం..
చాలాకాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.. ఇకపోతే ఇప్పటివరకు ఈ జంట తమ పెళ్ళి గురించి స్పందించలేదు.. కానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఈ జంట..

పుల్కిత్ ప్రేమ , పెళ్లి వ్యవహారాలు..
ఇదిలా ఉండగా పుల్కిత్ కి ఇది రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో శ్వేత రోహిరాను వివాహం చేసుకున్న ఇతడు ఇప్పుడు ఈమెతో వివాహానికి సిద్ధమయ్యాడు. శ్వేతా రోహిరా ఎవరో కాదు సల్మాన్ ఖాన్ కి సోదరి వరుస.. 2014లో వివాహం చేసుకున్న వీరు 2015లో మనస్పర్ధలతో విడిపోయారు.. ఇక తర్వాత యామి గౌతమ్ తో కూడా ప్రేమలో పడ్డారు పుల్కిత్.. కానీ వీరి ప్రేమ, పెళ్లి వరకు వెళ్లలేదు.. చివరికి పుల్కిత్ , కృతికర్బంద ప్రేమలో పడ్డారు .. అలా 2019 నుంచే ఆమె ప్రేమలో మునిగితేలుతున్నారు.. ఇప్పుడు వివాహానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. ఏదేమైనా త్వరలోనే వీరి పెళ్లి కాబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు