Sharwanand: తండ్రి, కూతురు ఒక పుట్టిన రోజు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకడు. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తను కూడా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్ చేశాడు. శర్వానంద్ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

ఇకపోతే కేవలం నటుడు గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాను చేశాడు శర్వా. అయితే ఒక సందర్భంలో శర్వా తన మనీ అంతటినీ కోల్పోయాడు. అయితే దాన్నుంచి తేరుకోవడానికి శర్వానంద్ కి దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆరేళ్లు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు శర్వానంద్. ఇండస్ట్రీలో శర్వానంద్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకటి రానా, రెండు రామ్ చరణ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కి శర్వానంద్ కి మధ్య ఉండే బాండింగ్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు.

ఇకపోతే శర్వానంద్ రీసెంట్ టైమ్స్ లో “ఒకే ఒక జీవితం” అనే సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకున్నాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఆ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. అయితే ఒక సందర్భంలో యంగ్ హీరోస్ అంతా ఒకేసారి పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. రానా నుంచి మొదలుపెడితే నిఖిల్, నితిన్ వంటి హీరోలందరూ కూడా కరోనా టైంలోనే చాలా తక్కువ మంది సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నారు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా శర్వానంద్ కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైన సంగతి తెలిసిందే. రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. అయితే నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా చాలా సినిమాలు అప్డేట్ లు ఇచ్చారు. ఈ సినిమాల అప్డేట్ తో పాటు శర్వానంద్ కి మరొక అదిరిపోయే శుభవార్త వచ్చింది. అదేంటంటే శర్వానంద్ కి నేడు పాప పుట్టింది.

ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు అని అందరికీ తెలిసిందే. అయితే యాదృచ్ఛికంగా ఇదే రోజు ఒక పాపకి జన్మనిచ్చాడు శర్వానంద్. శర్వాకు పుట్టిన పాప పేరు “లీలాదేవి” అని పేరు పెడుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా ఒకేరోజు రెండు గుడ్ న్యూస్ రావటం చాలా ఆనందకరమైన విషయం. ఇకపోతే శర్వా వరుస సినిమాలతో లైనప్ ని పెట్టి బిజీగా ఉన్నాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు