Ramcharan : నాటు జోరు ఇంకా తగ్గాలా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏ ముహూర్తాన RRR చేసాడో గాని ఆ జోరు ఇంకా తగ్గడం లేదు. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లకు దగ్గర కావస్తున్నా, తెలుగు వాళ్ళు మర్చిపోయినా, ఆ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ రామ్ చరణ్ కి ఫిదా అయిపోయారు. ఇక రామ్ చరణ్ ఎప్పుడు ముంబై వెళ్లినా తనని చరణ్ కంటే రామ్ పేరుతోనే ఎక్కువ పిలుస్తారు జనాలు. ఇక రామ్ చరణ్ RRR లో తారక్ తో కలిసి వేసిన నాటు నాటు జోరు పాట లో వేడి అయితే అస్సలు తగ్గడం లేదు. రీసెంట్ గా రామ్ చరణ్ అనంత్‌ అంబానీ రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలలో తాను నటించిన RRR సినిమాలోని సాంగ్ కు సెలెబ్రిటీలు సైతం డాన్స్ చేయడం జరిగింది.ఇక ఈ వెడ్డింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ‘నాటు నాటు’ పాటకు ఖాన్ త్రయంతో కలిసి కాలు కదిపారు. ఈ వీడియో ఇండియా మొత్తం ఎంత వైరల్ అయిందో తెలిసిందే.

అయితే తాజాగా ఫ్యాన్స్ ఆ వీడియో మరువకముందే రామ్ చరణ్ మరో ముగ్గురు స్టార్స్ తో కలిసి అదే పాటకు చిందేశాడు. ఇక వాళ్లలో ఇండియా మొత్తం అభిమానించే ఒక లెజెండరీ క్రికెటర్ ఉన్నాడు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది. తాజాగా ముంబై కి వెళ్లిన చరణ్ అక్కడ ఏకంగా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో చెర్రీ నాటు నాటు స్టెప్పులు వేయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క సచిన్ తోనే కాదు పక్కన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్ తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్ వేయడం జరిగింది. ఆ పక్కనే మరో మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఉన్నారు.

ISPL లో భాగంగా..

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో జరగబోయే ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌’ లో హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని థానే వేదికగా తాజాగా ISPL10 లీగ్ ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో ఈరోజు జరిగిన ప్రారంభ వేడుకల్లో రామ్ చరణ్‌ తో పాటు సూర్య, అక్షయ్‌ కుమార్‌, సచిన్‌ టెండూల్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ క్రికెట్‌ గాడ్ సచిన్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, తమిళ్ స్టార్ హీరో సూర్య తో ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసారు. ఆ సమయంలో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోలు,సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ISPL టీమ్ లో మొత్తం 6 టీమ్స్‌ పాల్గొంటున్నాయి. వీటిలో మజ్‌హీ ముంబై జట్టుకి అమితాబ్‌ బచ్చన్‌, శ్రీనగర్‌ కే వీర్‌ టీమ్ కి అక్షయ్‌ కుమార్‌, బెంగళూరు స్టైకర్స్‌కి హృతిక్‌ రోషన్‌, చెన్నై సింగమ్స్‌ జట్టుకు సూర్య, టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా టీమ్‌కి సైఫ్‌ అలీ ఖాన్‌, ఓనర్స్ కాగా ఫైనల్ గా ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు రామ్‌ చరణ్ ఓనర్స్‌గా ఉన్నారు. అయితే దాదోజీ కొండదేవ్‌ స్టేడియం వేదికగా మార్చి 6న నుంచి 15వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్‌10 మ్యాచ్ లు జరగనున్నాయి.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తన 16వ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా పై మరిన్ని అప్డేట్స్ రామ్ చరణ్ పుట్టిన రోజున రివీల్ చేసే ఛాన్స్ ఉన్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు