RC16 : జాన్వికపూర్ అచ్చ తెలుగందం..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పాన్ ఇండియా వైడ్ గా అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తెలుగులో దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న RC16 లో కూడా అఫిషియల్ గా కంఫర్మ్ చేసారు. ఇక ఈ సినిమాలో జాన్వీ నటిస్తుందని గత ఆరునెలల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా కొన్ని రోజుల కిందే జాన్వీ తండ్రి బోణి కపూర్ చరణ్ సినిమాలో చేస్తుందని అనౌన్స్ చేయగా, తాజాగా జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ గా విష్ చేస్తూ చిత్ర యూనిట్ తమ సినిమాలో కంఫర్మ్ అయినట్టు అనౌన్స్ చేసారు. ఇక జాన్వీ కపూర్ అలనాటి తార శ్రీదేవి బోనికపూర్ ల గారాల పట్టి గా, ఒక స్టార్ కిడ్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉంది.

పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం..

జాన్వికపూర్ కెరీర్ మొదట్లో గ్లామర్ రోల్స్ చేసినా కూడా ఆ తర్వాత పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలే చేయడానికి ఇష్టపడుతుంది. ఇక బాలీవుడ్ లో రిలీజ్ అయిన గుంజన్ సక్సేనా లాంటి సినిమాల్లో జాన్వీ కపూర్ కష్టం ఎంతుందో తెలిసిందే. అయితే సరైన సక్సెస్ లేకపోవడం వల్ల బాలీవుడ్ లో కొంత మంది ఐరన్ లెగ్ ట్యాగ్ ని ఇచ్చారు. కానీ ఈ అమ్మడు అవేమి పట్టించుకోకుండా సినిమాల మీద ద్రుష్టి పెట్టింది. ఇక తెలుగులో ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు దేవర, RC 16 గనుక హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో జాన్వీ కపూర్ దశ తిరిగిపోవడం ఖాయం.

- Advertisement -

ట్రెడిషనల్ వేర్ లో జాన్వీ కనువిందు..

జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తనలోని సౌత్ కల్చర్ భావాలూ ఎక్కువగా ఉన్నాయి. తన తల్లి శ్రీదేవి ఉన్నప్పటినుండి కూడా జాన్వీ కపూర్ టెంపుల్స్ కి అక్కడక్కడా రెగ్యులర్ గా వెళ్తూ ఉండేది. ఇక సినిమాల్లో జాన్వీ ఎంత గ్లామర్ గా కనిపించినా, గుళ్ళకి వస్తే మాత్రం ఎంతో సంప్రదాయంగా పద్దతి గా ఉండేది. తాజాగా పుట్టినరోజునాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ అక్కడ లంగా వోణి డ్రెస్ లో ఎంతో చక్కగా తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక శ్రీదేవి లేకపోయినా, ప్రతి సంవత్సరం ఒక్కసారైనా జాన్వీ కపూర్ తిరుమలకి వస్తూ ఉండడం విశేషం. ఇక జాన్వీ కపూర్ తిరుమల దర్శనం తర్వాత అదే డ్రెస్ లో చేసిన ఫోటోషూట్స్ ఎంతో చక్కగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనిపించే రేంజ్ లో ఆ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు