Vyooham : రెంటు ఖర్చులు కూడా రాలేదు..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ల ప్రభావం నడుస్తున్నందు వల్ల వరుస బెట్టి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాలు వ్యక్తిగతంగా ఆయా పొలిటికల్ పార్టీలను ఉద్దేశించే తీసినవి కానీ, ప్రజల గురించి తీసిన సినిమాలు లేవు. పైగా ఇప్పటివరకూ రిలీజ్ అయిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. యాత్ర 2, రాజధాని ఫైల్స్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఎలక్షన్స్ దగ్గర పడటంతో కనీసం ఓపెనింగ్స్ వస్తాయని ఒక వర్గం ఆడియన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి కానీ వాటిలో ఏవి కూడా ఆడియన్స్ ను అలరించ లేక పోతున్నాయి. అన్నింటికి అన్ని సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లనే సొంతం చేసుకోగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా కూడా రిలీజ్ అయింది.

ఎలా తీశారో తెలిసిందేగా!

అయితే రామ్ గోపాల్ వర్మ గత పదేళ్లుగా ఎక్కువ శాతం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వివాదాస్పద చిత్రాలు, ముఖ్యంగా పేరడీ నేపథ్యంలో పొలిటికల్ చిత్రాలు తీస్తున్నాడు. ఈ సినిమాలు ఆడినా, ఆడకపోయినా గత ఎలక్షన్ల సమయంలో కాస్త ప్రభావం చూపించాయన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వ్యూహం సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఎట్టకేలకు మార్చి 2న రిలీజ్ అయింది. పేరడీ మూవీని తలపిస్తూ లో క్వాలిటీతో తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇది అందరూ ఊహించిందే అయినా థియేటర్లలో ఓపెనింగ్స్ అయినా వస్తాయని అనుకున్నారు.

- Advertisement -

కిరాయి ఖర్చులు కూడా రాలేదు..

రామ్ గోపాల్ వర్మ సినిమా ఒక వర్గం ఆడియన్స్ కి నచ్చేలా తీసినా, తెలుగు రాష్ట్రాల్లో150 కి పైగా థియేటర్లలో రిలీజ్ కాగా, మొదటి ఆటకే అట్టర్ ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకుని, కనీసం థియేటర్ల రెంట్ ఖర్చులను కూడా రికవరీ చేయలేక చాలా చోట్ల డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఓవరాల్ గా అందిన సమాచారం ప్రకారం ట్రాక్ చేసిన థియేటర్స్ లో గ్రాస్ పట్టుమని 10 నుండి 15 లక్షల రేంజ్ లో కూడా లేదంటే ఏ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ పేరు మీద ప్రజెంట్ పొలిటికల్ హీట్ లో ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది అనుకున్నారు. కానీ పట్టుమని పది మంది కూడా థియేటర్లకు రాలేకపోవడంతో థియేటర్లలోంచి దాదాపు ఎత్తేశారని సమాచారం. ఎప్పట్లాగే వర్మ ఖాతాలో ఇంకో డిజాస్టర్ పడినట్టే. అయితే RGV మాత్రం వ్యూహం సీక్వెల్ శపథం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు