Gaami : హైప్ కి బిజినెస్ కి సంబంధం లేదు..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా ఫైనల్ గా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ పాటు సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ కి రెడీ అయింది. దర్శకుడు విద్యాధర్ చాలా శ్రమతో ఈ సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పెద్దగా హైప్ లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా మంది ఆడియన్స్ లో ఈ సినిమా చూడాలన్న క్యూరియాసిటీ పెరిగింది. పైగా ఈ పండక్కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉంది ఈ సినిమాకే. మహా శివరాత్రి పండగే ఈ సినిమాకి అడ్వాంటేజ్.

ట్రైలర్ రిలీజ్ తర్వాతే అసలు బిజినెస్..

గామి మూవీ మొదలైనపుడు ఇండస్ట్రీ లో కూడా చాలా మందికి ఈ సినిమా గురించి తెలీదు. తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒక్క సారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీ &టేకింగ్ అండ్ విజువల్స్ చూసి ప్రతీ ఒక్కరూ ఇది హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉందంటూ మెచ్చుకున్నారు. ట్రైలర్ లో ఇచ్చిన ఆ స్టోరీ లైన్ కి కూడా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. దాంతో గామి సినిమా మీద అంచనాలు ఓవర్ నైట్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి. అందువల్ల ట్రైలర్ కి ముందు ఏమాత్రం బిజినెస్ చూపించని ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ వాల్యూ బిజినెస్ రేంజ్ చూపించింది అని చెప్పాలి. ఇక గామి ఒక ప్రయోగాత్మక సినిమా అయినా కూడా క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటం, సినిమాలో మైథాలజి టచ్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ లో బజ్ ఏర్పడటంతో బిజినెస్ పరంగా కూడా జోరు చూపించింది.

- Advertisement -

పోటీలోనూ మంచి బిజినెస్..

ఇక గామి సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, ఒక్కసారి ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఏరియా వారీగా చూస్తే గమనిస్తే…
నైజాం లో 3.50Cr,
సీడెడ్ లో 1.2Cr,
ఆంధ్ర 3.50Cr, జరగగా, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.20CR కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి మరో 2Cr జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా గామి 10.20 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం మీద సినిమా 10.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా, గామి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా కూడా ఈ బిజినెస్ ను వీకెండ్ లో దాటేయొచ్చు అని చెప్పొచ్చు. పైగా మహాశివరాత్రి పండగ అడ్వాంటేజ్ ఈ సినిమా కి చాలా ప్లస్ అవుతుంది. అదే విధంగా ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అది పోటీగా వచ్చే వేరే సినిమాలకి ప్లస్ అవుతుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు