Nagarjuna: టబుతో రహస్యంగా పెళ్లి.. నిజం బయటపెట్టిన నాగార్జున..!

ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లలో హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా గుర్తొచ్చే పేరు టబు..50 సంవత్సరాలు దాటినా ఇంకా వివాహం చేసుకోకుండా పలు రకాల రూమర్ల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా టబు నడిపిన ప్రేమాయణాల విషయానికి వస్తే ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గుర్తుకువస్తారు.. టాలీవుడ్ కింగ్, మన్మధుడు అనగానే గుర్తొచ్చే పేరు హీరో అక్కినేని నాగార్జున.. ఇతర స్టార్ హీరోలతో పోల్చుకుంటే ఈయనకి లేడీస్ అలాగే యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఆరు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ అదే యవ్వనంతో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు..

నాగార్జున సినీ కెరియర్..
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకు వెళుతున్న ఈయన హిట్..ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూసిన నాగ్ తాజాగా ఈ సంక్రాంతికి నా సామిరంగా అంటూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి రచ్చ చేశారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు..పైగా వసూళ్లు కూడా బాగానే వచ్చాయి.

నాగార్జున వ్యక్తిగత జీవితం..
నాగార్జున వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ..తన మొదటి భార్య లక్ష్మి కి విడాకులు ఇచ్చి.. ప్రముఖ హీరోయిన్ అమల ను వివాహం చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు.. అలాగే నాగార్జునకు ఇద్దరు కుమారులు కాగా.. అందులో నాగచైతన్య , అఖిల్ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.. భారీ హిట్ల కోసం వీరిద్దరూ శ్రమిస్తున్నారనే చెప్పాలి..

- Advertisement -

హీరోయిన్స్ తో నాగార్జున ప్రేమాయణం పై క్లారిటీ..
తాజాగా అనుష్క , టబు లతో ఈయన ప్రేమాయణం నడిపారనే వార్తలు కథనాలుగా వెలువడగా దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. మా ముందున్న ఫ్లాట్ నా భార్య , తను దగ్గరుండి కట్టించుకున్నారు.. నాకు టబు సినిమాల్లోకి రాకముందే తెలుసు.. తాను హైదరాబాద్ అమ్మాయి.. నా బెస్ట్ కోవర్కర్.. ఫేవరెట్ హీరోయిన్ అంటే తన పేరే చెబుతాను.. మా కుటుంబ సభ్యురాలు కూడా.. మా నాన్న అమ్మ గారికి కూడా టబూ చాలా ఇష్టం.. మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..తనకు అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు.. టబు చాలా ఎమోషనల్.. తనకి నేనొక సైకియార్టిక్ డాక్టర్..బాధ కలిగితే తెల్లవారుజామున రెండింటికి నా పర్సనల్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది.. హైదరాబాద్ వచ్చెయ్ అంటాను.. అలా మా ఇద్దరి మధ్య స్నేహబంధం చాలా గట్టిది.. గొప్పది కూడా.. అనుష్క విషయంలో కూడా ఇలాగే జరిగింది.. నేను టాల్ హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తాను.. ఎందుకంటే నేను హైట్ ఉన్నాను కాబట్టి .. జోడి బాగుంటుందని అనుష్కను తీసుకునేవాడిని.. కానీ సమాజం పాడైపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు