Nagarjuna : నా ‘సామిరంగ’ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. ఏదో మాట వరుసకు చేసినట్టుంది…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ అయిన మరో సినిమా “నా సామిరంగ”. పండగ సినిమాల్లో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి సంక్రాంతి విజేతగా నిలిచిందన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన గుంటూరు కారం, సైన్ధవ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. అయితే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కమెర్షియల్ మూవీ నా సామిరంగ ఫ్యామిలీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. కంటెంట్ పరంగా యావరేజ్ గానే ఉన్నా పండగ ఊపులో గట్టెక్కింది.

ఇక ఈ సినిమాలో హీరోగా నాగార్జున నటించగా, సెకండ్ లీడ్ హీరోగా అల్లరి నరేష్, మరో ప్రత్యేక పాత్రలో రాజ్ తరుణ్ నటించాడన్న సంగతి తెలిసిందే. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా, మిగతా హీరోలకు జోడిగా మిర్ణా, రుక్సార్ ధిల్లాన్ నటించారు.

తాజాగా నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ వేడుక జరిపారు చిత్ర యూనిట్. మూవీ బ్రేక్ ఈవెన్ అవడానికి పది రోజులకి పైగానే సమయం తీసుకోగా, ఆ తర్వాతే చిత్ర యూనిట్ ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి కేవలం మూవీ చిత్ర యూనిట్ మాత్రమే హాజరవడం జరిగింది. కానీ ఒక్కళ్లలో కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న సంతోషం, ఎక్సయిట్మెంట్ అంతగా కనిపించలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఎందుకంటే పండగ ఊపులో హిట అయినా, మేకర్స్ ఆశించినంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సినిమా కాలేదు. నాగ్ కం బ్యాక్ సినిమా అని మేకర్స్ అంటున్నా, నాగ్ గత చిత్రాల సక్సెస్ రేంజ్ మాత్రం కాదని చెప్పాలి. పైగా మూవీ నటీనటుల్లో ప్రధాన తారాగణం మాత్రమే హాజరయ్యారు. మరి ఈ సెలెబ్రేషన్స్ జరపాల్సిన అవసరం అంత ఉందా అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ జరిపినా పండగ అయిన వెంటనే చేస్తే కనీసం వసూళ్లు పెరగడానికి అవకాశం ఉండేదని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఈ విధంగా అయినా నాగార్జున కి ఓ హిట్ అయితే వచ్చిందని చెప్పాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు