Ajay Bhupathi : ‘మంగళవారం’ సినిమాకి అవార్డుల పంట..

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా “మంగళవారం”. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిందన్న విషయం తెలిసిందే. ఇక లాస్ట్ ఇయర్ నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా ఓ రియల్ స్టోరీని ఆధారంగా చేసుకుని తీయడం జరిగింది.

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతే కాకుండా డైరెక్టర్ గా అజయ్ భూపతికి హీరోయిన్ పాయల్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ప్రియదర్శికి కూడా మరో బ్రేక్ ఇచ్చింది. అన్నిటికి మించి ఈ సినిమాకి ఆయువుపట్టు లా అజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన బీజీఎమ్ నిలిచింది.

అయితే తాజాగా జరిగిన జైపూర్ ఇంటెర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమా మంగళవారానికి నాలుగు కేటగిరీల్లో అవార్డులు రావడం జరిగింది. ఈ విషయాన్నీ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. మంగళవారం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా పాయల్ రాజ్ పుత్ కి అవార్డు రాగా, బెస్ట్ సౌండ్ డిజైన్ లో రాజా కృష్ణన్, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో, ఇంకా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఇలా నాలుగు కేటగిరీ లో ఈ సినిమాకు అవార్డులు వరించాయి. ఇక మంగళవారం సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యాక మరింత ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు