Animal Actress Tripti Dimri: రణబీర్ తో అక్కడ ఛాన్స్ రాలేదుగాని, ఇక్కడ అదరగొట్టింది..!

Animal Actress Tripti Dimri

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు 920 కోట్లు కొల్లగొట్టింది. రణబీర్ కపూర్ కి ఒక మాస్ స్టార్ డమ్ తెచ్చి పెట్టిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ పేరు దక్కింది ‘త్రిప్తి దిమ్రి’ కి. ఈ సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా పరిచయం లేని ఈ భామ యానిమల్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది.

తాజాగా బాలీవుడ్ లో ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ లో త్రిప్తి దిమ్రి, రణబీర్ తో కలిసి చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది. అయితే యానిమల్ లో త్రిప్తి దిమ్రి హీరోయిన్ కాకపోయినా, ఆ సినిమాలో రణబీర్ తో డాన్స్ తప్ప అన్నీ చేసింది. ఇక రొమాంటిక్ సీన్ల విషయానికి వస్తే రష్మిక కంటే ఈమెకే ఎక్కువ సీన్లు పడ్డాయి. కానీ సినిమాలో రణబీర్ తో కుదరని డాన్స్ పెర్ఫార్మన్స్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో కుదిరింది.

ఇక బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో యానిమల్ కి ఐదు కేటగిరీల్లో అవార్డులు రావడం విశేషం. అయితే యానిమల్ తర్వాత త్రిప్తి దిమ్రి కి వరుస మూవీ ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మేకర్స్ ఈమెపై బాగా ఫోకస్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న త్రిప్తి త్వరలోనే సౌత్ లో కూడా పాగా వేయడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు