Gunturu Karam : ఎలా చూసినా నిర్మాతలకు లాభమే.. కానీ బయ్యర్లు?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఏది అంటే అందరూ చెప్పే సినిమా “గుంటూరు కారం”. దీనికి మెయిన్ రీసన్ మహేష్ త్రివిక్రమ్ కాంబోనే. అయితే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. దీనికి పోటీగా రిలీజ్ అయిన హనుమాన్ అనూహ్యంగా పుంజుకుని బ్లాక్ బస్టర్ అవగా, గుంటూరు కారం కేవలం ఓపెనింగ్స్ మాత్రమే దక్కించుకుని యావరేజ్ గా నిలిచింది.

నిజానికి ఘోరంగా ప్లాప్ అయ్యే ఛాన్స్ ఉన్న గుంటూరు కారం పండగ అడ్వాంటేజ్ తో ఓపెనింగ్స్ దక్కించుకుని యావరేజ్ మూవీ స్టేటస్ ని దక్కించుకుందని చెప్పాలి. అయితే ట్రేడ్ మార్కెట్ లో ఈ సినిమా లెక్కలు చూస్తే బడ్జెట్ బిజినెస్ లెక్కలు అన్నీ కంపేర్ చేసి చూస్తే సినిమాతో నిర్మాతలకు లాభమే దక్కిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి బడ్జెట్ ని గమనిస్తే గుంటూరు కారం సినిమా బడ్జెట్ 85 కోట్లు కాగా మొత్తం రెమ్యునరేషన్లు మరియు ప్రమోషన్ల ఖర్చుతో కలిపి 150 కోట్లు దాటింది.

ఇక థియేట్రికల్ రైట్స్ 132 కోట్లకు అమ్ముడవగా, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 80కోట్లకు పైగానే నిర్మాతలకు, దక్కింది. ఈ లెక్కన నిర్మాతలకు ఎలా చూసినా ప్రాఫిటే దక్కింది అనొచ్చు. అయితే సినిమా వల్ల లాస్ అయింది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే.. అది కూడా వచ్చిన వసూళ్లతో కంపేర్ చేస్తే 15 నుండి 20% మాత్రమే నష్టపోయారని తెలుస్తుంది.

- Advertisement -

అయితే నిర్మాత నాగ వంశి ఆ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం టిల్లు స్క్వేర్ ని లిమిటెడ్ ప్రైస్ లో దక్కేలా చేస్తాడని సమాచారం. నష్టపోయిన బయ్యర్లకు ఇక్కడ టిల్లుగాడి ద్వారా సర్దుబాటు చేస్తాడని టాక్ నడుస్తుంది.అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాలి. ఇక గుంటూరు కారం థియేట్రికల్ రన్ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఎండ్ అవగా, హైదరాబాద్ లాంటి మేజర్ సిటీ ఏరియాల్లో కొన్ని థియేటర్లలో ఇంకా ఆడుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు