Bollywood Actress: ఆ హీరోయిన్ కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్?

Bollywood Actress

జాన్వి కపూర్ ఈ హీరోయిన్ కి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. “ధడక్” అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. ఎన్టీఆర్ సరసన “దేవర” సినిమాలో నటిస్తోంది. తన తల్లి కోరిక మేరకే టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

తన తల్లి శ్రీదేవి ఉన్నప్పుడు కూతురిని సౌత్ లో మంచి హీరోయిన్ చేయాలని అనుకుందట. శ్రీదేవి కూడా ఎన్నో భాషచిత్రాల్లో నటించినప్పటికీ సౌత్ లో వచ్చినంత క్రేజ్ మరెక్కడ రాలేదు. తన బాటలోనే తన కూతురిని సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడిందట. కానీ ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి కన్నుమూసింది. ఇక ఎలాగైనా తన తల్లి కోరిక తీర్చాలని జాన్వి బాలీవుడ్ ను వదిలేసి సౌత్ లో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తోందట. తన తల్లిలానే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని ప్రార్థిస్తుందట.

ప్రస్తుతం జాన్వి ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైన ఉండగానే జాన్వికి ఇతర సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తీయబోయే సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ని అనుకుంటున్నారట. అంతేకాకుండా బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న సినిమాలో సూర్య సరసన “కర్ణ” సినిమాలో హీరోయిన్గా జాన్వి పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రేజ్ చూస్తుంటే జాన్వి సౌత్ లో స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా, తన తల్లి కోరికను కూడా తీర్చేలాగా కనిపిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు