Amy Jackson Marriage: ప్రియుడుతో తల్లి అయ్యింది.. కానీ పెళ్లికి మాత్రం ఇంకొకరా..?

Amy Jackson Marriage

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం పెద్దగా అవసరం లేదు. ఐ, రోబో 2.0, ఎవడు వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ప్రస్తుతం తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. తమిళ్లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ వన్ లో కనిపించి అలరించింది. ఇకపోతే అమీ జాక్సన్ సినిమాలలో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంది. దాదాపు 5 సంవత్సరాల వరకు జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో ప్రేమలో పడి అతడితోనే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక బిడ్డ పుట్టాక ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ప్రియుడుతో పెళ్లి అయ్యింది కానీ పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరు కావాలా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇక తన ప్రియుడితో బ్రేకప్ తర్వాత కొడుకుని చూసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్న ఈమె.. తాజాగా విదేశీ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ చట్టపట్టలేసుకుని కెమెరా ముందు కనిపించడంతో… ఈ దృశ్యాలను చూసిన నెటిజెన్లు.. ఇక రెండో ప్రియుడి తో కూడా రిలేషన్ లో ఉందా? మరో బిడ్డను కంటుందా ? లేక పెళ్లి చేసుకుంటుందా? అంటూ కొత్త అనుమానాలు తలెత్తాయి.

ఇక తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను గమనించినట్లయితే.. అమీ జాక్సన్ కి ఎడ్ వెస్ట్ విక్ ప్రపోజ్ చేశాడు.. అందమైన మంచు కొండల మధ్య చుట్టూ బంధుమిత్రుల సమక్షంలో కాళ్లు వంచి ఆమెకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు ఎడ్ వెస్ట్ విక్. సంతోషంతో అమీ జాక్సన్ కూడా ఓకే చెప్పింది.. త్వరలోనే వీరి పెళ్లి కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Bollywood actress Amy Jackson is ready to marry another man

ఇక ఇది చూసిన చాలా మంది ప్రియుడుతో బిడ్డను కని ఇప్పుడు వేరొకరిని వివాహం చేసుకోబోతోంది సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి పనులు చేసి సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అమీ జాక్సన్ ఇలా కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ విషయాలపై అమీ జాక్సన్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు