Anupama Parameswaran : అనుపమకు పెళ్లయిందా.. ఏకంగా తాళిబొట్టు చూపిస్తూ..!

Anupama Parameswaran

తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలా భారీ క్రేజ్ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్.. తెలుగు, తమిళ్, మలయాళం ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ .. పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను విడుదల చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఈగల్, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవి కాక తమిళంలో జయం రవి సరసన ఒక సినిమాలో నటిస్తున్నది. అయితే గత కొన్నేళ్ల నుంచి అనుపమ పెళ్లికి సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తాళి చూపిస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఏంటీ అనుపమ నిజంగానే పెళ్లి చేసుకుందా అంటూ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే, అనుపమ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులను అలరిస్తూ తన గ్లామర్ ఫోటోలతోనే కాకుండా సినిమాలలోని పలు క్యారెక్టర్లకు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఫన్నీ క్యాప్షన్స్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా అనుపమ పెళ్లికూతురుగా మారిపోయి పట్టుచీరలో ఒంటినిండా నగలతో మెడలో తాళి బొట్టు చూపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులలో అనుపమ వివాహం చేసుకుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో చాలామంది ఫీల్ అయిపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అది నిజం పెళ్లి కాదని.. ఆమె నటించిన సైరన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ కు సంబంధించిన ఫోటోలు అన్నట్లుగా తెలుస్తోంది. అందులో జయం రవిని అనుపమ వివాహం చేసుకుంటుంది. ఆ సాంగ్ లోని మేకింగ్ స్టిల్స్ ని ఇలా ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా సమాచారం.. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

Eagle heroine Anupama Parameswaran in bride get up

Eagle heroine Anupama Parameswaran in bride get up

Eagle heroine Anupama Parameswaran in bride get up

అసలు విషయం తెలిసిన అభిమానులు హామ్మయ్య ఈ పెళ్లి ఫోటోలు కేవలం సినిమాలోని స్టిల్స్ మాత్రమేనా.. నిజంగానే పెళ్లయిపోయిందని చాలా భయపడ్డామంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం మరొకసారి “అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఒక టాలీవుడ్ హీరో తో ఈమె ప్రేమాయణం నడిపింది అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పై అనుపమ ఎప్పుడు స్పందించలేదు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు