JIFF Awards: పాయల్ కెరియర్ మలుపు తిరిగినట్టేనా.. ఏకంగా 4 అవార్డులు..!

JIFF Awards

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం RX -100.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ వీరి కాంబినేషన్లో కొన్నేళ్ల తర్వాత వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం.. ఈ సినిమా గత ఏడాది నవంబర్ 17న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఇందులో పాయల్ యాక్టింగ్ అద్భుతంగా చేసిందని చెప్పవచ్చు.. ఇందులో ఈమెకు ఒక కొత్త రోగం ఉన్నట్టుగా డైరెక్టర్ అజయ్ భూపతి చూపించిన తీరు బోల్డ్ సన్నివేశాలతో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగింది.

దాదాపుగా రూ .5 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ మంగళవారం సినిమా.. దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారం సినిమా చూసి ప్రేక్షకులు, సినిమా విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా మంచి విజయాన్ని అందుకున్న మంగళవారం సినిమా కూ తాజాగా అవార్డుల పంట పండినట్లు తెలుస్తోంది.

జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులకు మంగళవారం సినిమా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ జరగబోతోంది. ఈ ఫెస్టివల్ లో పలు సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి.. ఇందులో బాలయ్య నటించిన భగవంతు కేసరి సినిమాతో పాటు హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమాకి అవార్డులు వచ్చాయి.

- Advertisement -

మంగళవారం సినిమాకి గానూ ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పుత్, అలాగే ఉత్తమ ఎడిటింగ్ గా గుల్లపల్లి మాధవ్ కుమార్.. ఉత్తమ సౌండ్ డిజైనర్ గా రాజ కృష్ణన్.. ఉత్తమ క్యాస్టింగ్ డిజైనర్ గా మదసర్ మహమ్మద్ వంటి వారికి అవార్డులు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. దీంతో పాయల్ అభిమానుల సైతం చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ మంగళవారం సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు కెరియర్ మలుపు తిరిగినట్టే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అజయ్ భూపతి వల్లే పాయల్ కెరియర్ మలుపు తిరిగింది అనడంలో సందేహం లేదు..

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు