Prabhas : శ్రీలీలను ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ !

Prabhas : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటన, అందం, డాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. తనలో ఉన్న స్పెషల్ టాలెంట్ డ్యాన్స్. తన డ్యాన్స్ తో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేస్తుంది. కానీ శ్రీలీల అభిమానులు తనకి ఏదైనా ఒక సూపర్ క్యారెక్టర్ రావాలని ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. కానీ ఈ అమ్మడికి అంత స్పెషల్ గా ఎలాంటి సినిమా ఆఫర్లు రావడం లేదు. తాను నటించిన సినిమాల్లో డ్యాన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ పాత్ర ఎంపిక విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

ఇక కొన్ని రోజులపాటు శ్రీలీల సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాత్ర ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చిందట. కానీ ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోదని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సరసన శ్రీలీల హీరోయిన్ గా వద్దని అంటున్నారట. గతంలో మారుతి సినిమాలో శ్రీలీలను తీసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది అన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ సీన్ రివర్స్ అయ్యింది. ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రాలు….సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, హనురాగవపూడి సినిమాలు ఉన్నాయట. స్పిరిట్ సినిమా సంగతి పక్కన పెడితే….హను రాఘవపూడి సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా పెట్టాలని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం శ్రీలీల సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

దీంతో శ్రీలీలను ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారట. ఎవరైనా సోషల్ మీడియాలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని పోస్టులు పెడితే వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారట. మరి హనురాఘవపూడి, ప్రభాస్ వారి సినిమాలో శ్రీలీలకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. ప్రభాస్, శ్రీలీల ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తారని వస్తున్న పుకార్లలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు