Manikandan : వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ “ట్రూ లవర్”..

టాలెంటెడ్ హీరో మణికందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జై భీమ్ తో గుర్తింపు పొందిన ఈ నటుడు, ‘గుడ్ నైట్’ వంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాక తెలుగులో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. అందుకే తాను హీరోగా నటిస్తున్న తాజా చిత్రాన్ని ఒకే రోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మణికందన్ హీరోగా నటించిన తాజా చిత్రం “ట్రూ లవర్”.

ప్రభురాం వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది.టీజర్ ని చూస్తుంటే అప్పట్లో ప్రదీప్ రంగరాజన్ నటించిన లవ్ టుడే సినిమా గుర్తొస్తుంది. గాడంగా ప్రేమించుకునే ప్రేమికుల మధ్య అపార్ధాలకు తావిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఈ సినిమా ద్వారా చూపించనున్నాడు దర్శకుడు.

- Advertisement -

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ని బేబీ ప్రొడ్యూసర్ ఎస్కెన్, డైరెక్టర్ మారుతి కలిసి రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు లో లాస్ట్ ఇయర్ బేబీ కూడా ఇలాంటి స్టోరీ లైన్ తో రాగా, అందులో హీరోయిన్ ని కొంచెం నెగిటివ్ టచ్ లో చూపించడం జరిగింది. ఇక ట్రూ లవర్ లో తెలుగమ్మాయి ప్రముఖ సింగర్ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించడం విశేషం. మరి ట్రూ లవర్ కూడా ఒక లవ్ టుడే లా, ఒక బేబీ సినిమాలా ప్రేమ కథా చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.’

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు