Dil Raju: సంక్రాంతి సినిమాల వివాదంతో దిల్ రాజు సంచలన నిర్ణయం

Dil Raju :  2023 సంక్రాంతి సినిమాల విడుదల సమయంలో జరిగిన వివాదం కారణంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టార్గెట్ అయిన విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు సంక్రాంతి సినిమాల మధ్య నెలకొన్న క్లాష్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టడంతో చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారంటూ దిల్ రాజుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి విషయంలో తను షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు వెల్లడించారు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. నిజానికి ఆరు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అందులో దిల్ రాజు నిర్మించిన “ఫ్యామిలీ స్టార్” కూడా ఉండగా, ఆయనే స్వయంగా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక “ఈగల్” మూవీ టీంకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పి వాయిదా వేయించారు. దీంతో “ఈగల్” మూవీ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకొని, ఫిబ్రవరి 9కి తమ రిలీజ్ డేట్ ను మార్చుకోవడం మరో సమస్యకు కారణమైంది. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన “టిల్లు స్క్వేర్”ను మార్చ్ 29కి వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే అదే రోజున రిలీజ్ కు రెడీగా ఉన్న “ఊరు పేరు భైరవకోన” మూవీ మేకర్స్, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “లాల్ సలాం”, యాత్ర 2 టీమ్స్ వెనక్కి తగ్గకపోవడంతో “ఈగల్” సమస్య స్టార్ట్ అయింది. దీంతో తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుని ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న “ఈగల్”కు సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చేందుకు దిల్ రాజు ప్రయత్నించారు.

- Advertisement -

కానీ యాత్ర 2, లాల్ సలాం టీమ్స్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో “ఈగల్”కే ఎక్కువ స్క్రీన్స్ ఇస్తామని తాజాగా దిల్ రాజు వెల్లడించారు. “ఊరు పేరు భైరవకోన” టీం మాత్రం ఫిబ్రవరి 16 కు తమ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఊరు పేరు భైరవకోన మూవీ పోస్ట్ పోన్ అవుతుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే దేవర మూవీ పోస్ట్ పోన్ అయితే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తాడనే విషయాన్ని కూడా వెల్లడించారు.

ఈ సినిమా సమస్యలతో పాటు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయంపై కూడా దిల్ రాజు స్పందించారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలతో పాటు పరిష్కారాలను కూడా తెలియజేశామని, బుధవారం జరగబోయే ఈసీ మీటింగ్ లో అందరిని కలుపుకుని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చారు. అలాగే పనిలో పనిగా నెక్స్ట్ టర్మ్ కు తను ప్రెసిడెంటుగా ఉండబోను అనే విషయాన్ని ఇప్పుడే చెప్పేశారు. ఇక తాజాగా పద్మ విభూషణ్ అందుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి అభినందించబోతున్నట్టు దిల్ రాజు వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి, ఫిబ్రవరి సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో తీవ్ర నెగెటివిటీని ఎదుర్కొన్న దిల్ రాజు నెక్స్ట్ టైం చాంబర్ ప్రెసిడెంట్ గా పదవిని చేపట్టకూడదు అనే కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు