Ananya Nagalla: వాటికి సర్జరీ చేయించుకున్న తెలుగు హీరోయిన్.. డేర్ స్టెప్ తీసుకుందా..?

తెలుగు సినీ పరిశ్రమకు మొదట మల్లేశం అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ళ.. ఈ చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకుంది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించడంతో ఈమెకు బాగా కలిసొచ్చింది.. అయితే ఆ తర్వాత అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.. దీంతో తన అవకాశాల కోసం తానే కష్టపడుతున్నానంటూ ఎన్నోసార్లు తెలియజేసింది.. తాను కూడా ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలననే విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ డైరెక్టర్ లకు హింట్ ఇస్తూ ఉంటుంది

తంత్ర విడుదల..
ప్రస్తుతం అనన్య మెయిన్ పాత్రలో నటించిన చిత్రం తంత్ర.. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. హర్రర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పైన ఈ ముద్దుగుమ్మకు భారీ ఆశలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు హర్రర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అంతేకాకుండా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్ కూడా అందరిని భయపెట్టించేలా కనిపిస్తున్నాయి.. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన అనన్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది…

అనన్య వ్యక్తిగత జీవితం..
ఇలాంటి సమయంలోనే అటు వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను తెలియజేసింది.. తాజాగా దావత్ అనే షోలో పాల్గొనింది అనన్య.. అందులో తన సర్జరీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ ని కాపాడుకోవడం కోసం కచ్చితంగా సర్జరీలు చేయించుకుంటున్నారని చెప్పవచ్చు.. మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి సర్జరీ చేయించుకున్నారా అనే ప్రశ్న యాంకర్ అడగగా.. అందుకు అనన్య నిర్మొహమాటంగానే అవునని చెప్పేసింది…

- Advertisement -

సర్జరీ పై క్లారిటీ..
అనన్య లిఫ్ట్ పిల్లర్ సర్జరీ చేయించుకున్నానని తెలియజేసింది.. అయితే ఇది చేయించుకొని ఇప్పటికి రెండేళ్లు అవుతోందని.. ఇప్పుడు పోయినట్టుగా కనిపిస్తోందంటూ తెలియజేసింది.. లిప్ పిల్లర్ అంటే పెదాలు షేప్ వచ్చేలా చేస్తారని తెలిపింది..

ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలు..
ఇక ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి కూడా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. ఎవరికైనా కార్లు , అసిస్టెంట్లు ఉంటే ఇండస్ట్రీలో మరో రకంగా చూస్తారని. అవి లేకపోతే అసలు ఎవరూ పట్టించుకోరని వెల్లడించింది..తాను సినీ ఇండస్ట్రీలో ఎదగడానికి ముఖ్య కారణం సమంత, అలియా భట్ అంటూ తెలిపింది.. ఇక తంత్ర సినిమా హిట్ అందుకున్నాక అందరూ తనను గుర్తుపట్టి మాట్లాడుతారని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ హ్యాపీనెస్ బయట ఎక్కడ కనిపించలేదని వెల్లడించింది.. ప్రస్తుతం అనన్య చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సర్జరీ విషయం పై కూడా ఇలా ధైర్యంగా నోరువిప్పి చెప్పడంతో అనన్య ధైర్యానికి అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు.. ఏదేమైనా అనన్య నటించిన ఈ తంత్ర సినిమా సక్సెస్ అవ్వాలని.. ఆమె ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు