NBK 109: బాలయ్య ఫ్యాన్స్ కి శుభవార్త.. టీజర్ రిలీజ్ డేట్ లాక్..!

టాలీవుడ్ లో సీనియర్ అగ్ర హీరోలుగా పేరు పొందిన వారిలో బాలయ్య కూడా ఒకరు.. ప్రస్తుతం బాలయ్య వరుసగా సక్సెస్ లు అందుకుంటూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి హిట్ చిత్రాలతో ఫుల్ జోష్ తో ముందుకు వెళుతున్నారు.. అదే జోష్లో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు బాలయ్య.. ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో కలిసి తన 109 వ సినిమానీ చేయబోతున్నారు.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన, త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు..

NBK 109 టీజర్ డేట్..
ఈ సినిమా విభిన్నమైన యాక్షన్ కథాంశంతో ఎమోషనల్ గా సాగే కథ అన్నట్టుగా సమాచారం.. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని పోస్టర్లు సైతం వైరల్ గా మారాయి .. తాజాగా ఇప్పుడు బాబి, బాలయ్య సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే మార్చి 8వ తేదీన బాలయ్య 109వ చిత్రానికి సంబంధించి టీజర్ ని సైతం రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా విషయం పైన డైరెక్టర్ బాబీ సస్పెన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. హీరోయిన్ విషయంలో కూడా ఎక్కడ రిలీజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు..

NBK 109 మూవీ షూటింగ్ పగడ్బందీగా ప్లాన్ చేసిన బాబీ..
ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా శరవేగంగా ముందుకు వెళ్తోంది.. బాలయ్య పాత్ర విషయంలో కూడా డైరెక్టర్ బాబి ఒక సీక్రెట్ ను మెయింటైన్ చేస్తూ కేవలం బాలయ్య ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ పోస్టర్లను విడుదల చేస్తున్నారు.. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సీక్రెట్స్ ని డైరెక్టర్ బాబీ రివిల్ చేస్తారా అనే విషయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.NBK -109 చిత్రంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే తెలుగు హీరోయిన్గా పేరుపొందిన చాందిని చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ కి జోడి గాని చాందినీ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఊటీలో జరుగుతోంది. దాదాపుగా 20 రోజులపాటు ఒక భారీ షెడ్యూల్ తో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల డైరెక్టర్ బాబి వెల్లడించారు.. అయితే ఆంధ్రాలో రాజకీయాలు దగ్గర పడుతున్న సమయంలో బాలయ్య కూడా ఈ సినిమా షూటింగ్ కి అప్పుడప్పుడు విరామం ఇస్తూ రాజకీయాలలో కూడా పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం పాలిటిక్స్ కి ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ సినిమా షూటింగ్ కి తక్కువ కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. మరి ఈ సినిమాను బాలయ్య ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు