HBD Janhvi Kapoor : జాన్వీ టాప్ 5 మూవీస్… డోంట్ మిస్ ఆన్ ఓటిటి

ఇన్నాళ్లు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన జాన్వి కపూర్ ఇప్పుడు ఎట్టకేలకు సౌత్ పై దృష్టి పెట్టింది. ట్రిపుల్ ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా “ఆర్సి 16″లో జాన్వీ హీరోయిన్ అన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చ్ 6న 27వ పుట్టినరోజు జరుపుకుంటున్న జాన్వి కపూర్ కొత్త సినిమాల గురించి అప్డేట్స్ అనౌన్స్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. మరి ఈరోజు ఆమె బర్త్ డే సందర్భంగా ఇప్పటిదాకా జాన్వి కపూర్ నటించిన టాప్ ఫైవ్ మూవీస్ ఏంటి? ఆ ఇంట్రెస్టింగ్ మూవీస్ ను ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…

1. బవాల్
2023లో జాన్వి కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన “బవాల్” మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే జాన్వి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

2. గుడ్ లక్ జెర్రీ
“గుడ్ లక్ జెర్రీ” మూవీ 2022లో రూపొందగా, డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. ఇందులో జాన్వి డి గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇందులో కుటుంబ భారాన్ని మోసే జెర్రీ అనే ఒక బీహారి అమాయకపు అమ్మాయి పాత్రను పోషించింది జాన్వి. అయితే ఆ అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో స్మగ్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అనేదే స్టోరీ.
3. రూహి
2021లో జాన్వి కపూర్ నటించిన హారర్ జానర్ మూవీ “రూహి”. ఈ సినిమాలో జాన్వి చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఒకవైపు సాధారణ అమ్మాయిగా కనిపిస్తూనే, మరోవైపు దెయ్యం పట్టిన అమ్మాయిగా అదరగొట్టింది జాన్వి. ఈ హర్రర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది.

- Advertisement -

4. మిలీ
జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన మరో వైవిధ్యమైన సినిమా “మిలీ”. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఓ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయి అనుకోకుండా అందులోనే ఉన్న స్టోరేజ్ ఫ్రీజర్ లో చిక్కుకు పోతే ఏంటి పరిస్థితి? ప్రాణాలు తీసేంత చలిలో ఆ అమ్మాయి ఎలా బ్రతికింది? గడ్డ కట్టించే చలి నుంచి తనను రాత్రి అంతా రక్షించుకోవడానికి ఏం చేసింది? అనేదే ఈ మూవీ స్టోరీ.

5. గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్
జాన్వి కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో ఇంటరెస్టింగ్ మూవీ “గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్”. ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ. జాన్వి ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటించి ఆకట్టుకుంది. భారత వైమానిక దళంలో తొలి మహిళా పైలట్ గా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీనీ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు