Siddu Jonnalagadda : అనుపమ తో మిస్ బిహేవ్.. అమ్మాయిలతో అలా ప్రవర్తించడం సరికాదు..!

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు మరొకసారి అనుపమ పరమేశ్వరన్ తో టిల్లు స్క్వేర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్లో చాలా గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే.. మల్లికా రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగావంశీ , సాయి సౌజన్య నిర్మించారు.. డీ.జే.టిల్లు కి మించిన వినోదాన్ని అందించడానికి టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా అందులో అనుపమపై జరిగిన ట్రోల్స్ గురించి సిద్దు స్పందించారు.

అనుపమ పై ట్రోల్స్..

అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఇప్పుడున్న కుర్రాళ్ళ ఆరాధ్య దేవత ఈ మలయాళీ కుట్టి.. కానీ కొన్ని రోజులుగా ఈమెపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నీకేమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ మరి కొంతమంది మాత్రం ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఏకంగా నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు.. ఇక అనుపమా పై ఫాన్స్ ఇంత సీరియస్ కావడానికి కారణం టిల్లు స్క్వేర్ అని చెప్పవచ్చు.. ఈ సినిమాలో అనుపమ గ్లామరస్ గా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది.. అంతేకాదు ఇక్కడ సిద్దు జొన్నలగడ్డతో లిప్ లాక్ , హగ్గులతో రెచ్చిపోయింది.. టీజర్ తోనే ఊహించని షాక్ ఇచ్చిన అనుపమ ఇటీవల విడుదలైన ట్రైలర్లో మరింత బోల్డ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. దీంతో ఇన్నాళ్లు ట్రెడిషనల్ రోల్స్ చేసిన తమ హీరోయిన్ ఇప్పుడు ఇలాంటి సీన్స్ చేసింది ఏంటి అనే కోపంతో ఊగిపోతున్నారు అభిమానులు.. దీంతో ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తే తనకే నచ్చడం లేదని అందుకే కాస్త కొత్తగా ట్రై చేశానని చెప్పుకొచ్చింది అనుపమా. అయినా సరే అభిమానుల కోపం మాత్రం చల్లారినట్టు కనిపించడం లేదు.. ఇక దాంతో అనుపమ పోస్టర్స్ పై నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు.
అందుకే టిల్లు స్క్వేర్ ప్రమోషన్లతో పాటు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె హాజరు కాలేదు..

సిద్దు జొన్నలగడ్డ కౌంటర్..

ఇక దీనిపై సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. నెగిటివ్ కామెంట్స్ పై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.. ఫ్లర్టింగ్ అనేది అవతలి వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉండాలి.. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.. టిల్లు స్క్వేర్ నుంచి పోస్టర్ విడుదలయ్యింది.. దానికి కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు..అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను.. అంటూ క్లాస్ తీసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.. దీంతో నెగిటివ్ కామెంట్స్ వల్ల అనుపమ హర్ట్ అయ్యిందని.. అందుకే ప్రీ రిలీజ్ వేడుకకు కూడా రాలేదని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు