Anupama: ఈ క్యారెక్టర్ ని వదులుకుంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది

ప్రేమమ్ సినిమాతో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఆ సినిమాను తెలుగులో చూడకముందే మలయాళం లో చూసిన చాలా మంది ప్రేక్షకులు అనుపమాకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారని చెప్పొచ్చు. ఇదే సినిమాను మళ్లీ చందు మొండేటి తెలుగులో రీమేక్ చేశాడు.

అయితే అనుపమ తెలుగు తెరకు పరిచయమైంది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ అనే సినిమాతో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత,నితిన్ కలిసి నటించిన ఈ సినిమా నితిన్ కెరియర్ లోని మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా టైంలో కొద్దిపాటి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

యద్దనపూడి సులోచన రాణి రచించిన మీనా అనే నవలను ఈ సినిమాగా తెరకెక్కించారు. త్రివిక్రమ్ పై ఆ మధ్యకాలంలో చాలామంది చెలరేగిపోయారు. మొత్తానికి అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ యద్దనపూడి సులోచన రాణి గారిని కలవడం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన టైటిల్స్ లో ఆమె పేరు పడకపోవడం గురించి తన పంథాలో ఏదో క్లారిటీ ఇస్తూ వచ్చాడు త్రివిక్రమ్.

- Advertisement -

ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ప్రేమమ్ సినిమాతో తెలుగులో మంచి పేరు సాధించుకుంది అనుపమ. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన శతమానం భవతి సినిమా అనుపమకి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను కూడా తీసుకొచ్చింది ఆ సినిమా. అనుపమ చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించింది.

ఆ తర్వాత చాలామంది లానే అనుపమ కెరియర్లో వరుస డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. మళ్లీ చందు దర్శకత్వంలో చేసిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి భారీ ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది ఈ సినిమా. ఆ తర్వాత నిఖిల్ తో చేసిన 18 పేజెస్ కూడా మంచి హిట్ అయింది.

ఇకపోతే అనుపమకి పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ అంటూ రీసెంట్ టైమ్స్ లో రాలేదు. ఇకపోతే టిల్లు స్క్వేర్ అనే సినిమాలో లిల్లీ పాత్రలో నటిస్తుంది అనుపమ. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అనుపమకి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఈ లిల్లీ అనే క్యారెక్టర్ని వదులుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో నటించే అమ్మాయికి కూడా ఇటువంటి క్యారెక్టర్ స్కోప్ ఉండదు అంటూ చెప్పింది అనుపమ.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు