Tillu Square : ఫ్యామిలీ చూసేదేం లేదా ఈ సినిమాలో.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోస్లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సిద్దు ఎన్నో సినిమాలకు రచయితగా వర్క్ చేశాడు. సిద్దుకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చిన సినిమా డీజే టిల్లు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమా కేవలం ఫన్ కోసం మాత్రమే తీసింది అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు సిద్దు. టిల్లు క్యారెక్టర్ని సిద్దు డిజైన్ చేసిన విధానం చాలా మందికి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది.

అయితే డీజే టిల్లు సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీసన్ కూడా ఆ క్యారెక్టర్రైజేషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుంది. ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ సిద్దు రాసిన డైలాగ్స్. అలానే టిల్లు పాత్రలో సిద్దు ఒదిగిపోయిన తీరు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మంచి ఫన్ క్రియేట్ చేశారు థియేటర్లో. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా మంచి ప్లస్ అయింది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ యూత్ టార్గెట్ గా రిలీజ్ చేశారు. ఆ టార్గెట్ కూడా మిస్ అవకుండా పర్ఫెక్ట్గా యూత్ కనెక్ట్ అయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారని నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

చాలామందికి టిల్లు సినిమా చూస్తున్నాను సేపు ఈ సినిమా ఇంకొంతసేపు ఉంటే బాగుండు హాయిగా నవ్వుకోవచ్చు అనే ఫీల్ కూడా కలిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ చిత్ర యూనిట్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా పేక్షకులను అలరించింది.

ఈ సినిమాలో మళ్లీ సిద్దు అందించిన డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. కేవలం ఆకట్టుకోవడమే కాకుండా అద్భుతమైన ఫన్ ను మళ్లీ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మూవీ యూనిట్ కి ఫిలిం జర్నలిస్ట్ నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే సిద్దును ఉద్దేశిస్తూ ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేశారు.
కృష్ణ అండ్ లీల, మా వింత గాధ వినుమ , డీజే టిల్లు ఇలా రీసెంట్ టైమ్స్ లో సిద్దు లో సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ చూడడానికి ఇబ్బందికరంగా, అడల్ట్ గా ఉంటున్నాయి అనేది ఆ ప్రశ్న యొక్క సారాంశం. అయితే ఆ ప్రశ్నకు సిద్దు ఆన్సర్ ఇచ్చేలోపే నిర్మాత సూర్యదేవరనాగ వంశీ ఫ్యామిలీ చూసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏమీ లేవా.? లవ్ లో ఉన్న ఇద్దరు ముద్దుపెట్టుకుంటే ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏముంది.? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

అయితే నాగ వంశీ ఇచ్చిన ఈ ఆన్సర్ కొంతమంది సినిమా జర్నలిస్టులకి వెటకారం లా అనిపించినా కూడా, రియాలిటీ చూస్తే నిజంగానే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయింది. ఈ సినిమాను చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇదే మాటను.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, థియేటర్లోనే ఈ సినిమాను చూస్తారంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు నాగ వంశీ.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు