Thammudu: షూటింగ్ అప్డేట్

యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఆ సినిమా తర్వాత చేసిన దిల్ అనే సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు, నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు. దిల్ సినిమా తర్వాత నితిన్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి.

దిల్ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా నితిన్ కెరియర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. అందులో నితిన్ పర్ఫామెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇకపోతే సై సినిమా తర్వాత నితిన్ కి హిట్ కొట్టడానికి దాదాపు ఒక పదేళ్ళు పట్టిందని చెప్పొచ్చు.

ఇకపోతే నితిన్ కి బెస్ట్ కంబాక్ ఫిల్మ్ అంటే ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ మ్యూజిక్ చాలా బాగా హిట్ అయింది. అయితే ఈ సినిమా ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

- Advertisement -

ఆ ఫంక్షన్ నితిన్ కెరీర్ ని మార్చింది అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద ఫ్యాన్ అని ఆ ఫంక్షన్ తోనే చాలామంది కళ్యాణ్ అభిమానులు కూడా తెలిసి వచ్చింది.
డిజాస్టర్ లో ఉన్న నితిన్ ని ఒక్కసారిగా పైకి లేపిన సినిమా ఇష్క్. ఆ సినిమా దగ్గరనుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పొచ్చు.

ఇష్క్ సినిమా తర్వాత నితిన్ చేసిన ప్రతి సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా నితిన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన ఫ్యాన్. జానీ సినిమా ఫెయిల్ అయినప్పుడు నితిన్ ఏడ్చాడు అని కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నితిన్ పవన్ కళ్యాణ్ ను రిఫరెన్స్ గా వాడటం కొంతమేరకు తగ్గించాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో నితిన్ చేసిన సినిమాలు కూడా మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇకపోతే నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాను చేస్తున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో తమ్ముడు అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం అదే టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తుండడంతో చాలామందికి అంచనాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మారేడుమిల్లి లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకున్న నితిన్ ఈసారి పవర్ స్టార్ ను సినిమాలో ఏ రేంజ్ లో వాడుతాడు తెలియాలి అంటే వేచి చూడడం తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు