Nithin: యంగ్ దర్శకుడు పైనే నమ్మకం

రీసెంట్ టైమ్స్ లో ఈటీవీ విన్ లో వచ్చిన 90 సిరీస్ ఎంతగా ప్రేక్షకులును ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి అద్భుతంగా కనెక్ట్ అయింది ఈ సిరీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న యూత్ కి వాళ్ల చైల్డ్ హుడ్ డేస్ లో మెమోరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. అప్పటి విషయాలన్నిటినీ అప్పటి జ్ఞాపకాలు అన్నిటిని చాలా అందంగా రాసుకుంటూ అద్భుతంగా చూపించాడు ఆదిత్య హాసన్.

ఈ సిరీస్ తో ఆదిత్య హసన్ కి మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. కేవలం పేరు మాత్రమే కాకుండా వరుస అవకాశాలు కూడా ఆదిత్య కు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ తో కూడా ఆదిత్య కి ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. అలానే రీసెంట్ గా వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమలు. ఈ సినిమాకి ఆదిత్య తెలుగు డైలాగ్స్ అందించాడు. అయితే ఈ డైలాగ్స్ కి మంచి పేరు వచ్చింది. దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై ప్రశంసలను కురిపించారు.

ఇకపోతే ఆదిత్య కి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు కూడా ఒక సినిమా ఓకే అయినట్లు సమాచారం వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈ బ్యానర్ నిర్మించింది. ఈ బ్యానర్లో ఒక నేషనల్ అవార్డు ఫిలిం కూడా ఉంది అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా ఈ బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ లో చాలామంది యంగ్ డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే ఆదిత్య ఇప్పుడు నితిన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ రీసెంట్ టైమ్స్ లో చేసిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఈ సినిమాను ఆదరించారు. లేకపోతే నితిన్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్లే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం నితిన్ ఇప్పుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమాను చేస్తున్నాడు. ఇదే టైటిల్ పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ తమ్ముడు సినిమాలో అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిత్యతో చేస్తున్న సినిమా అప్డేట్ కూడా ఒకటి తెలుస్తోంది.

ఆదిత్య దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమా కథ కంప్లీట్ గా పూర్తవుబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ ఒక పక్కింటి అబ్బాయిల కనిపించబోతున్నాడు. ఈ సినిమాని శ్రేష్ట మూవీస్ నిర్మిస్తుంది. మరి ఈ యంగ్ దర్శకున్న నమ్ముకున్న నితిన్ కి ఎంతటి హిట్ సినిమాను ఆదిత్య అందిస్తాడో తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడకు తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు