Nithin: క్వాలిటీ తక్కువ స్క్రాప్ ఎక్కువ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకడు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తనకంటూ కొన్ని మంచి సినిమాలు ఎన్నుకుంటూ మంచి పేరును సాధించుకున్నాడు. జయం సినిమా తర్వాత వచ్చిన దిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చేసిన సంబరం, శ్రీ ఆంజనేయం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమా మంచి హిట్ అయింది.

సై సినిమా తర్వాత దాదాపు ఒక 10 ఏళ్ల వరకు నితిన్ హిట్ సినిమా చూడలేదు. వరుస డిజాస్టర్స్ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా మళ్లీ నితిన్ ని హీరోగా నిలబెట్టింది. అయితే ఇష్క్ సినిమాపై ఎవరికి అంచనాలు లేని తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం, ఆ సమయంలోనే నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఆన్ స్టేజ్ పై చెప్పడం వల్ల పవన్ అభిమానులు కూడా నితిన్ ను ఓన్ చేసుకున్నారు.

ఇష్క్ తర్వాత వచ్చిన గుండెజారి గల్లంతయింది, హార్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం సినిమాలు కూడా పర్లేదు అనిపించుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అ ఆ” సినిమా నితిన్ కెరియర్ కి పెద్ద హిట్ అయింది. నితిన్ ని 50 కోట్లు మార్కెట్లోకి చేర్చిన సినిమా అంటే “అ ఆ” అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత చేసిన ఛల్ మోహనరంగా, శ్రీనివాస్ కళ్యాణం సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి

- Advertisement -

త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఆ తర్వాత చేసిన ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ పాలయ్యాయి. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్నాడు. నితిన్ కి ఈ సినిమా పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఒక యంగ్ హీరో ఇన్ని సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత కూడా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. దీనికి నితిన్ ఫాదర్ యొక్క బాక్గ్రౌండ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండటం కూడా ఒక రకమైన ప్లస్ అని చెప్పొచ్చు.
ఏదేమైనా మళ్లీ నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో మంచి హిట్ కొడితే కానీ నిలబడటం కష్టం. ఇప్పటికి నితిన్ సినిమాల విషయంలో క్వాలిటీ తక్కువ స్క్రాప్ ఎక్కువ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు