Personality Development: సక్సెస్ ఫుల్ పీపుల్ సీక్రెట్స్… ఈ నాలుగు అలవాట్లతో లైఫ్ సెట్టు

Personality Development: లైఫ్ లో సక్సెస్ ఫుల్ కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికి కావాల్సిన ఇన్స్పిరేషన్, క్రమశిక్షణ, అవసరమైన అలవాట్లను కొంతమంది మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. మరికొంతమంది ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళను ప్రేరణగా తీసుకుని లైఫ్ లో ఎదగాలని చూస్తూ ఉంటారు. అయితే సక్సెస్ ఫుల్ పీపుల్ మార్నింగ్ రొటీన్ సీక్రెట్స్ ను తెలుసుకుని ఫాలో అయితే మీరు కూడా సగం సక్సెస్ అయినట్టే. ఇంతకీ ఆ సీక్రెట్స్ ఏంటి అంటే…

1. త్వరగా మేల్కొనడం

Personality Development: Successful People Secrets... Set Life With These Four Habits

- Advertisement -

ఉదయాన్నే నిద్ర లేవడం అనేది సక్సెస్ ఫుల్ పీపుల్ చేసే మొట్టమొదటి పని. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో పలు సమస్యల కారణంగా ఉదయాన్నే నిద్రలేచేవారు చాలా తక్కువ. వేకువ జామునే నిద్ర లేవడం వల్ల ఆ రోజు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులను ప్లాన్ చేసుకోగలుగుతారు. అలాగే వ్యాయామం, ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ ఫాస్ట్ చేయడం, సెల్ఫ్ డెవలప్మెంట్ వంటి వాటికి కావాల్సినంత టైం దొరుకుతుంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 89% మంది సక్సెస్ ఫుల్ పీపుల్ ఉదయం 6 గంటలలోపే నిద్రలేస్తారట.

2. నిద్ర లేవగానే చేయాల్సిన పని

Personality Development: Successful People Secrets... Set Life With These Four Habits
మేల్కొన్న తర్వాత మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి? చాలామంది ఫోన్ చూడడం లేదా సోషల్ మీడియా, ఈమెయిల్ వంటివి చెక్ చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ సక్సెస్ ఫుల్ పీపుల్ మాత్రం ఆఫీసులో చేయాల్సిన పనిని అక్కడే చేసేస్తారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ పనుల గురించి ఆలోచించరు. ఉదయాన్నే వాళ్లు ఫోన్ చూసి టైం వేస్ట్ చేయకుండా, వ్యాయామం వంటి వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఒక సర్వే ప్రకారం 89% మంది ఉదయాన్నే పళ్లు తోముకోవడంతో సహా ఏదైనా చేసే ముందు ఆఫీస్ ఈమెయిల్ ని చెక్ చేస్తారట. కానీ ఫోన్లో ఈ ఆఫీస్ కి సంబంధించిన నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవడం వల్ల ఉదయాన్నే చురుగ్గా పనులు చేసుకోగలుగుతారు.

3. హెల్దీ బ్రేక్ ఫాస్ట్

Personality Development: Successful People Secrets... Set Life With These Four Habits
నేటి బిజీ లైఫ్ లో జనాలు లేటుగా నిద్ర లేవడం, హడావిడిగా ఫ్రెష్ అయిపోయి, ఏదో ఒక ఫుడ్ తో కడుపు నింపేసుకున్నాం అనిపించుకుని ఆఫీసులకి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు ట్విస్ట్. రోజంతా నిరుత్సాహంగా ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, పని మీద ఫోకస్ చేయలేకపోవడం, ఆకలిగా అనిపించడం, పనిలో ఉండగా నిద్ర రావడం వంటివి జరుగుతాయి. ఫలితంగా ఆ ఎఫెక్ట్ చేసే వర్క్ పై పడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఉదయాన్నే పోషకాహారంతో కూడిన బ్రేక్ ఫాస్ట్ విలువ. అల్పాహారం అనేది ఏకాగ్రతను పెంచే విధంగా, మానసికంగా చురుగ్గా, ఉత్తేజంగా ఉంచే విధంగా ఉండాలి. అంటే ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉండేలా చూసుకోవాలి.

4. సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్

Personality Development: Successful People Secrets... Set Life With These Four Habits
వేకువ జామునే నిద్ర లేవడం వల్ల ఆఫీస్ కు వెళ్లే లోపు చేయాల్సిన పనులకు కావలసినంత సమయం దొరుకుతుంది. ఆ సమయంలో వ్యాయామం, ధ్యానం, లేదా ఇష్టమైన బుక్స్ చదవడం, పాడ్ కాస్ట్ వినడం వంటివి చేయొచ్చు. ఉదయాన్నే ఆచరించే ఇలాంటి అలవాట్ల వల్ల ఆలోచన విధానం మెరుగుపడడమే కాకుండా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఉదయాన్నే సెల్ఫ్ డెవలప్మెంట్ కు సక్సెస్ ఫుల్ పీపుల్ సమయాన్ని కేటాయిస్తారు. నిజానికి రాత్రంతా నిద్రపోవడం వల్ల ఉదయాన్నే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఏదైనా నేర్చుకోవడానికి అదే మంచి టైం అవుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు