Siddhu Jonnalagadda: ఆ టైటిల్ త్రివిక్రమ్ గారు పెట్టారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సునీల్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే సునీల్ నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఆఫీసులకి తిరిగేవాడు. ఆ టైంలో నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు అంటూ త్రివిక్రమ్ గురించి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు.

స్వయంవరం సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ కోసం దాదాపు వారి రూమ్ బయట ఒక ఆరు కార్ల వరకు వచ్చాయి. వారందరూ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేశారు. అయితే సునీల్ నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు అని చెప్పినప్పుడు పట్టించుకోని వాళ్లు కూడా ఆరోజు త్రివిక్రమ్ కోసం వెయిట్ చేశారు అని చెప్పుకొచ్చాడు సునీల్ ఒక సందర్భంలో. ఇకపోతే త్రివిక్రమ్ కి ఉన్న స్పాంటినీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అక్షరాలను అలవోకగా విసరడం, పదాలను అద్భుతంగా పొందుపరచడం త్రివిక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ముఖ్యంగా మాటలు కోసమే చాలామంది ఆ సినిమాలకు వెళ్తారు. త్రివిక్రమ్ రాసే మాటలు కూడా అంతే ఆసక్తికరంగా, అద్భుతంగా, లోతైన అర్ధాన్ని తెలియజేసే విధంగా ఉంటాయి. రైటింగ్ లో ఈ జనరేషన్ లో బెస్ట్ రైటర్ అంటే ఇప్పటికి త్రివిక్రమ్ పేరు వినిపిస్తుంది.

- Advertisement -

ఇకపోతే త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో మాత్రమే ప్రస్తుతం దర్శకుడుగా సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ బ్యానర్లు క్రేజీ యూత్ కంటెంట్ సినిమాలన్నీ వస్తుంటాయి. కేవలం క్రేజీ యూత్ కంటెంట్ సినిమాలు మాత్రమే కాకుండా, ఒక్కోసారి జెర్సీ లాంటి అద్భుతమైన సినిమాలు కూడా వస్తాయి.

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక బ్యానర్ ని పెట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్థాపించిన బ్యానర్లో త్రివిక్రమ్ గారి భార్య సౌజన్య శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలన్నిటికీ కూడా త్రివిక్రమ్ బ్యానర్ కూడా అనుసంధానంగా ఉంటుంది. ఇకపోతే ఈ రెండు బ్యానర్స్ కలిసి డీజే టిల్లు అనే సినిమాను నిర్మించాయి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. అయితే ఒక సినిమాకి సీక్వెల్ చేసేటప్పుడు చాలా పేర్లను పరిశీలిస్తారు. అలాంటి సందర్భంలోనే టిల్లు-2,2టిల్లు లాంటి పేర్లను అనుకుంటున్న తరుణంలో, టిల్లు స్క్వేర్ అని పెడదామయ్యా అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారంట అయితే ఇది అందరికీ నచ్చి ఈ టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇకపోతే త్రివిక్రమ్ గురించి చాలామందికి తెలిసిన విషయమే ఆయన ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నారు అని. సో ఎడ్యుకేషన్ కూడా ఇలా సినిమా టైటిల్ పెట్టడానికి ఆ స్పాంటినీటికి తోడైంది అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు