Tillu Square : ఇంకా సెట్స్ పైనే “టిల్లు స్క్వేర్”… రిలీజ్ డేట్ మర్చిపోయారా ఏంటి?

టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మర్చిపోయారా? అంటే అవునేమో అని డౌట్ వస్తోంది. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉండటమే అందుకు కారణం. ఇంతకీ “టిల్లు స్క్వేర్” మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే….

“టిల్లు స్క్వేర్”కు మారిన లెక్కలు…
2022లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన డీజే టిల్లు కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా, నేహా శెట్టి హీరోయిన్ గా కనిపించింది. రాధిక పాత్రలో ఆమె నటనకు, గ్లామర్ కు యూత్ ఫిదా అయ్యారు. కానీ సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ తో పాటు డైరెక్టర్ కూడా మారిపోయారు. హీరో ఒక్కడే కంటిన్యూ అవుతున్నాడు. డీజే టిల్లుకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, సీక్వెల్ టిల్లు స్క్వేర్ కు మల్లిక్ రామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ కు హీరో సిద్దు జొన్నలగడ్డ కథను అందించడంతో పాటు మెయిన్ లీడ్ గా నటించారు. నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చేసింది. టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్…
ఇల్లు స్క్వేర్ మూవీ మార్చ్ 29న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మర్చిపోయారా? అనే డౌట్ రాకమనదు. టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి రావడానికి రెండు మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, ఇంకా సినిమా సెట్స్ పైనే ఉంది. ఈవారం కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. మరోవైపు షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్లు స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు మూవీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని చిత్ర బృందం భావిస్తుంది. అందుకే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈరోజు నుంచి అంటే మార్చ్ 12 నుంచి టిల్లు స్క్వేర్ చివరి షెడ్యూల్ మొదలైంది. కాకినాడ పోర్ట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. వారం రోజులపాటు ఈ మూవీ షూటింగ్ అక్కడే జరగబోతున్నట్టు సమాచారం. మరి మేకర్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటూ ఈ మూవీని మరోసారి వాయిదా వేస్తారా ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

మారిన రిలీజ్ డేట్…
వాస్తవానికి టిల్లు స్క్వేర్ మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాతలు. కానీ సంక్రాంతి ఒప్పందాల కారణంగా ఈగల్ తెరపైకి రావడంతో, టిల్లు స్క్వేర్ వాయిదా పడింది. చివరికి మార్చి 29న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్లు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మధ్య ఉన్న లిప్ లాక్ సీన్లు సంచలనం సృష్టించాయి. మొత్తానికి మూవీపై హైప్ పెంచడానికి సిద్దు, అనూ రొమాన్స్ ను ఆయుధంగా వాడుకున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు