Telugu OTT : ఈ వారం థియేటర్ల కంటే ఓటిటి వైపే ముగ్గు చూపుతున్న ఆడియన్స్..

టాలీవుడ్ లో ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో పెద్ద సినిమాలు అయితే ఒకటి, మీడియం రేంజ్ సినిమాలు అయితే రెండు లేదా అంత కన్నా ఎక్కువ, చిన్న సినిమాలు అయితే అరడజనుకి పైగానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక లాస్ట్ వీక్ మహా శివరాత్రి కానుకగా భీమా, గామి తో పాటు ప్రేమలు అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ మూడింటిలో వేటికవే డిఫెరెంట్ జోనర్లో ఆడియన్స్ ని అలరించాయి. అలాగే ఈ వారం కూడా దాదాపు అరడజనుకి పైగా చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. కానీ అందులో ఒక్కటంటే ఒక్క సినిమాకి సరైన బజ్ లేదు. అయితే అందులో ఏ సినిమా అయినా కంటెంట్ బాగున్నా, అది రిలీజ్ అయిన తర్వాతే జనాలకి మౌత్ టాక్ ద్వారా తెలుస్తుంది.

కానీ ప్రస్తుతానికి రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలపై పెద్దగా ఆడియన్స్ కి ఇంట్రస్ట్ అయితే లేదు. మహా అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో రజాకార్ తెలంగాణ చరిత్ర తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి కొంత వరకు ఆ సినిమా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించొచ్చు. అయితే ఈ క్రమంలో ఓటిటి లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రం చాలా మంచి క్రేజ్ తో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ సినిమాల కంటే ఓటిటి సినిమాలపై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రస్ట్ చూపే అవకాశం ఉంది. ఆ ఓటిటి సినిమాల్ని ఒక్కసారి గమనిస్తే..

1. హనుమాన్ (జియో , జీ ఫైవ్ )

- Advertisement -

టాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా హనుమాన్ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా రిలీజ్ అయిన దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ కి రెడీ అయింది. మార్చి 16 న ఈ సినిమా హిందీ కలర్ సినీప్లెస్ ఛానెల్ టివిలో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. అలాగే అదే రోజు రాత్రి ఓటిటి జియో టివి లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అయితే అన్ని వెర్షన్ల హక్కులు జీ ఫైవ్ వారు సొంతం చేసుకున్నా, ఆ ఓటిటి రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది. కానీ ఈ 16న అందులో కూడా దాదాపు రిలీజ్ కావడం కంఫర్మ్ అని సమాచారం.

2. భ్రమయుగం ( హాట్ స్టార్)

మలయాళ మెగాస్టార్ మమ్మూటీ నటించిన భ్రమయుగం సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ప్రముఖ ఓటిటి ఛానెల్ హాట్ స్టార్ లో మార్చి 16 నుండి స్ట్రీమింగ్ అవబోతుంది ఈ సినిమా. ఇప్పటికే థియేటర్లలో చూడలేని ఆడియన్స్ ఇప్పుడు ఓటిటి లో చూడాలని ఎంతో వెయిట్ చేస్తున్నారు.

3. సేవ్ ది టైగెర్స్2 (హాట్ స్టార్ )

హాట్ స్టార్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ గా సేవ్ ది టైగెర్స్ 2 మార్చి 16న హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.

ఇంకా వీటితో పాటు రజినీకాంత్ లాల్ సలాం కూడా నెట్ఫ్లిక్స్ లో మార్చి 15న రిలీజ్ కాబోతుంది.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు