Telugu OTT Movies: ఈ వారం ఓటిటి సినిమాల రివ్యూలు… వళరి నుంచి సౌండ్ పార్టీ దాకా

ఈవారం ఓటీటీలోకి వచ్చిన వళరి, 12th ఫెయిల్, బ్రీత్, సౌండ్ పార్టీ సినిమాలు ఓటీటీ ప్రియులకు ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వళరి మూవీ రివ్యూ…
వెంకటేష్ గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రితిక సింగ్ చాలా కాలం తర్వాత వళరి అనే సినిమాతో వచ్చేసింది. ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ మూవీకి మృతిక సంతోషిని దర్శకత్వం వహించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయంలోకి వెళ్తే… దివ్య తన కుటుంబంతో కలిసి కృష్ణపట్నంలోని నేవీ క్వాటర్స్ లో ఉంటుంది. అయితే అదే ఊర్లో ఉన్న ఒక పాత బంగ్లా దివ్యను అట్రాక్ట్ చేస్తుంది. 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులను చంపిన కల వస్తూ ఉంటుంది ఆమెకు. అలాగే జరగని విషయాలు జరిగినట్టుగా ఊహించుకుంటుంది.

చేసిన తప్పులకు కర్మ అనుభవించక తప్పదు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. రెగ్యులర్ స్క్రీన్ ప్లే లాగా కాకుండా వళరి కథను గ్రిప్పింగా, భయపెట్టేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంతోషిని పర్లేదు అనిపించారు. సినిమాలో కర్ర సాములు, మహిళలను స్ట్రాంగ్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. కానీ కొన్నిచోట్ల సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అసలు అవి అక్కడ ఎందుకు ఉన్నాయ్ అనే విషయం అర్థం కాదు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉంటుంది. బిజిఎం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కానీ కొన్నిచోట్ల సిజి వర్క్ తేలిపోయింది. మొత్తానికి ఈ సినిమాకు హైలెట్ రితిక సింగ్. మిగతా నటీనటులు పర్వాలేదు అనిపించారు.

- Advertisement -

12th ఫెయిల్ రివ్యూ…
12th ఫెయిల్ వెబ్ సిరీస్ స్టోరీ నిజంగానే 12వ తరగతి ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ అనే కుర్రాడు ఐపీఎస్ ఆఫీసర్ గా ఎదిగిన విజయ గాథ. ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీని తెరపై ఎఫెక్టివ్ గా, సినిమాటిక్ గా చూపించడంలో డైరెక్టర్ విధు వినోద్ చోప్రా పాత్ర అమోఘం అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మస్సే నటించాడు అనడం కంటే జీవించాడు అనడం కరెక్ట్. ఐపీఎస్ మనోజ్ కుమార్ తన జీవితంలో పడిన వేదన, బాధ, కష్టాలు, కన్నీళ్లు, ఇలా ప్రతి ఎమోషన్ ను అద్భుతంగా పలికించాడు విక్రాంత్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 12th ఫెయిల్ వెబ్ సిరీస్ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు.

బ్రీత్ రివ్యూ
నందమూరి తామరమారావు మనవడు, నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ బ్రీత్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాగా, తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. జీరో కలెక్షన్స్ రాబట్టి చైతన్య కృష్ణను దారుణంగా ట్రోలింగ్ బారిన పడేసిన బ్రీత్ మూవీ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి అంటే… మెడికో థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి కాన్సెప్ట్, కొన్ని ట్విస్టులు మాత్రమే ప్లస్ పాయింట్స్. హీరోతో పాటు స్లో నేరేషన్, పాటలు, చిరాకు పెట్టే కామెడీ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. జీరో కలెక్షన్స్ తో దారుణమైన డిజాస్టర్ గా బ్రీత్ నిలిచింది. ఈ మూవీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సౌండ్ పార్టీ
వీజే సన్నీ హీరోగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన మూవీ సౌండ్ పార్టీ. గతేడాది నవంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కష్టపడకుండానే డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ మధ్యతరగతి ఫ్యామిలీ స్టోరీ ఇది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కొన్ని విసుగు పుట్టించే కామెడీ సీన్స్, కథనం రొటీన్ గా ఉండడం మైనస్ పాయింట్స్. ఇక లాజిక్కుల కోసం వెతికే వాళ్ళకు ఈ సినిమా గురించి ఆలోచించడం కూడా కష్టమే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ద్వితీయార్థంలో కామెడీ పర్లేదు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపించినా, ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం మాత్రం బాగానే చేశాడు డైరెక్టర్ సంజయ్ శేరి. ఇక బిట్ కాయిన్ ఎపిసోడ్ ట్విస్టు కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సరదాగా నవ్వుకుంటే చాలు అనుకునే వాళ్లకు మాత్రమే సౌండ్ పార్టీ.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు